ఈ వారమే మెగా డీఎస్సీ...11060 పోస్టులతో నోటిఫికేషన్ ! ఏటా రెండుసార్లు టెట్...?
ఈ వారమే మెగా డీఎస్సీ...11060 పోస్టులతో నోటిఫికేషన్ ! ఏటా రెండుసార్లు టెట్...?
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ వారంలోనే 11,060 పోస్టులతో నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డీఎస్సీకి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎంవోకు పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ వెలువడనుంది.
ఇందులో...
6,500కు పైగా ఎస్జీటీ ( Second Grade Teacher),
2,600 స్కూల్ అసిస్టెంట్ ( School Assistant),
700 లాంగ్వేజ్ పండిట్ ( Language Pandit),
190 పీఈటీ ( PET ) పోస్టులు ఉన్నట్లు సమాచారం.
ఏటా రెండుసార్లు టెట్...?
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఏటా రెండు సార్లు(జూన్, డిసెంబర్) నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా శాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. కొన్నేళ్లుగా బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారే టెట్ రాసేవారు. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్-2లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండటంతో టీచర్లు సైతం టెట్ రాస్తున్నారు.