జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2023- 24 సంవత్సరపు పాఠశాల వార్షికోత్సవ సంబరాలు
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2023- 24 సంవత్సరపు పాఠశాల వార్షికోత్సవ సంబరాలు
కర్నూలు/ వెల్దుర్తి, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి బాలికల హై స్కూల్ నందు శనివారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలుగా హెచ్ఎం చంద్రావతి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 1000 మంది విద్యార్థినీలు వారి తల్లిదండ్రులు 1500 మంది హాజరై వార్షికోత్సవాన్ని కనులారా తిలకించి తమ పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలేనా? ఇది లేక ఏదైనా కార్పొరేట్ పాఠశాల అన్నట్లుగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమ పిల్లలు కనువిందు అయిన ఆటపాటలతో వేసిన దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలు వెస్ట్రన్ డాన్సులు చూసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల హెచ్ఎం మరియు ఉపాధ్యాయులు విచ్చేసిన తల్లిదండ్రులకు చల్లటి నీరు, స్నాక్స్ భోజనం సదుపాయాలు కల్పించిన తీరుపై హెచ్ఎం కి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వార్షికోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ఒక పండగల ఒక శుభకార్యంలా జరిగింది.
ఈ కార్యక్రమానికి కర్నూలు డిప్యూటీ ఈవో హనుమంతరావు ఏడి పౌలు, వైఎస్ఆర్సిపి మండల అధ్యక్షుడు బొమ్మన రవి రెడ్డి, జడ్పిటిసి దాది పోగు సుంకన్న, సర్పంచ్ ముత్యాల శైలజ, ఎంఈఓ -2 రమేష్, పిఏఎంసి చైర్మన్ యశోదమ్మ, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు వావిలాల కృష్ణమూర్తి, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ సాయి ప్రసాద్ సూదేపల్లి, హైస్కూల్ హెచ్ ఎం వరలక్ష్మి, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయుడు, ఏఎస్ఐ బాలకృష్ణ, రిటైర్డ్ హెచ్ఎం అగస్టీన్ జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
విచ్చేసిన అతిధులు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలలో పాఠశాలకు, తల్లిదండ్రులకు, మంచి పేరు తేవాలన్నారు పట్టుదలతో విజయం సాధించాలన్నారు రాబోయే పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. స్థానిక డాక్టర్ మంజుల పాఠశాలకు 50 వేల విలువగల సామాగ్రి ప్రింటర్, కుర్చీలు, స్పోర్ట్స్ టీషర్ట్లు, ఇతరాత్ర సౌకర్యార్థం విరాళం అందించడం జరిగింది.
సహాయ సహకారాలు అందించిన డాక్టర్ మంజుల కి హెచ్ఎం చంద్రావతి శాల్వతో పూలమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే బాలికలు దాదాపు 30 దాకా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను తల్లిదండ్రులను చూపు మరల్చుకోలేని విధంగా కట్టిపడేశాయి. పిల్లలు వివిధ వేషధారణలతో ప్రత్యేక అలంకరణ లోని తమ పిల్లలతో ఫోటోలు దిగడానికి తల్లిదండ్రులు పోటీపడ్డారు.