రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

24 గంటల్లో రౌడీషీటర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు..

APPOLICE, ANANTAPUR POLICE, CRIME NEWS, AP NEWS
Peoples Motivation

24 గంటల్లో రౌడీషీటర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు..

ఐదుగురు అరెస్టు... మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
Image

అనంతపురం (పీపుల్స్ మోటివేషన్):-

నిన్న అనంతపూర్ లో జరిగిన రౌడీషీటర్ సయ్యద్ జిలాన్ కుక్కల జిలాన్ (33 సం) హత్య కేసును  24 గంటలలోపే ఛేదించిన అనంతపురం వన్ టౌన్ పోలీసులు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఐ రెడ్డెప్ప ఐదుగురు నిందితులను ఈ కేసులో అరెస్టు చేసి మూడు ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన నిందితుల వివరాల్లోకి వెళితే..

 👉పేరు పండ్యాల ప్రసాద్,ఇతని వయసు 42 సం.లు,నివాసం రాణినగర్, అనంతపురం

👉 పేరు నరేష్, ఇతని వయసు 36 సం.లు,నివాసం రాణి నగర్ అనంతపురం  

👉 పేరు ఎల్లప్ప, ఇతని వయస్సు 41 సం.,నివాసం LB కాలనీ,  బుక్కరాయ సముద్రం మండలం

👉 పేరు ప్రతాప్,ఇతని వయస్సు 25 సం.లు,నివాసం రాణి నగర్, అనంతపురం 

👉 పేరు సువర్ణ,ఇతని వయసు 30 సం.లు, నివాసం రాణి నగర్, అనంతపురం 

వీరి నేపథ్యం

స్థానిక శ్రీకృష్ణదేవరాయ నగర్ లో 2021 సంవత్సరంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న సయ్యద్ జిలాన్ (కుక్కల జిలాన్) పై అనంతపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ నమోదయ్యింది.

సయ్యద్ జిలాన్ (కుక్కల జిలాన్) ప్రస్తుతం అరెస్టయిన నిందితుల్లో ప్రసాద్, నరేష్ లతో కలసి బేల్దారి పనులు చేసారు. ఆ సందర్భంగా తలెత్తిన బేల్దారి పనుల డబ్బుల విషయంలో ఇప్పటికీ ప్రసాద్, నరేష్ లతో గొడవపడుతున్న వైనం. ఇది భరించలేని ప్రసాద్, నరేష్ లు ఎలాగైనా సదరు రౌడీషీటర్ ను చంపాలని పథకం రచించి స్థానిక సింధూర వైన్స్ దుకాణం వద్దకు పిలిపించుకున్నారు. ఈ ఇద్దరితో పాటు నరేష్ బావ యల్లప్ప, తమ్ముడు ప్రతాప్ మరియు చెల్లెలు సువర్ణ ల సహకారం తీసుకుని పథకం ప్రకారం ఈ ఐదుగురు కలసి సయ్యద్ జిలాన్ (కుక్కల జిలాన్) ను రాయితో కొట్టి చంపారు. అడ్డుపోయిన హతుడి స్నేహితుడయిన చంద్ర శేఖర్ పై కట్టెతో దాడి చేసి గాయ పరిచారు.

     అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ జి.ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ఒకటవ పట్టణ సిఐ వి.రెడ్డెప్ప, ఎస్సై పి.వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి ఈరోజు ఎన్టీఆర్ మార్గ్ లో ఈ ఐదుగురు నిందితుల అరెస్టు చేసి మూడు ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లో ఈ హత్య కేసును ఛేదించిన అనంతపురం వన్ టౌన్ సి.ఐ రెడ్డెప్ప, ఎస్సై వెంకటేశ్వర్లు బృందానికి జిల్లా ఎస్పీ అభినందించారు.

Comments

-Advertisement-