మార్చి 3వ తేదిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి
మార్చి 3వ తేదిన పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి
0-5 సం.ల చిన్నారులకు రెండు చుక్కల పల్స్ పోలియో తప్పనిసరి
2011 నుండి జిల్లాలో పల్స్ పోలియో కేసులు నమోదు కాలేదు
బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ లలో కూడా పల్స్ పోలియో టీకాలు
-జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు
కర్నూలు, ఫిబ్రవరి 26 (పీపుల్స్ మోటివేషన్):-
మార్చి 3వ తేదిన జరిగే పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 0-5 సం.ల చిన్నారులకు పల్స్ పోలియో టీకాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పల్స్ పోలియో పై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు మాట్లాడుతూ... 0-5 సం.ల వయస్సు ఉన్న చిన్నారులకు తప్పనిసరిగా పల్స్ పోలియో టీకాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3వ తేది (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పల్స్ పోలియో బూత్ లలో పల్స్ పోలియో టీకాలు అందజేయుటకు గాను విద్యా శాఖ, వైద్య శాఖ సమన్వయం చేసుకొని చిన్నారులకు పల్స్ పోలియో టీకాలు అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ లలో కూడా పల్స్ పోలియో టీకాలు అందజేయడం జరుగుతుందన్నారు. దాదాపు 2011 నుండి మన జిల్లాలో పల్స్ పోలియో కేసులు నమోదు కాలేదని ఇదే స్ఫూర్తితో వైద్య సిబ్బంది చిన్నారులకు పల్స్ పోలియో టీకాలు అందజేసేలా చూడాలన్నారు. అనివార్య కారణాల వల్ల 3వ తేది పల్స్ పోలియో టీకాలు వేసుకొని చిన్నారుల కోసం అశా/ఎఎన్ఎం సిబ్బంది ద్వారా మార్చి 4, 5 తేదీలలో ఇంటింటికి తిరిగి వారికి కూడా పల్స్ పోలియో టీకాలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ రామ గిడ్డియ్య, డిఐఓ ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.