రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు..

municipality news, telugu news, public issues news,
Peoples Motivation


ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా అధికారులు..

డంపింగ్ యార్డ్ వ్యర్థాలు కుందూ ఒడ్డున...



ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. డంపింగ్ యార్డులో వున్న వేస్ట్ ను కుందూ ఒడ్డున గుంతల లెవెలింగ్ చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. కుందూ ఒడ్డున వదలడం ప్రమాదంగా భావించవచ్చు. కుందూకు నీళ్ళు వస్తే ఆ ప్రాంతం నీటితో వుంటుంది. వ్యర్థాలు నీళ్లతో పాటు కుందూలో కలిస్తే కుందూ పరివాహ ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు కుందూ నీటిని తాగుతారు. వ్యర్థాలు విషతుల్యంలా అన్ని ఇందులో వుండడంతో ప్రజల అనారోగ్యాల భారిన పడటం ఖాయం. కాంట్రాక్టర్ తో కొందరు అధికారులు ఒకొక్క బిల్లుకు చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి. ఒకొక్క బిల్లు మంజూరు చేస్తే అధికారులకు నజరానా దాదాపు 10 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డుల్లో ఉన్న చెత్తా, చెదారం, కాల్వల్లో పూడికలు, వ్యర్థాలు డంపింగ్ యార్డుకు చేరుకుంటాయి. టన్నుల కొద్ది డంపింగ్ యార్డులో చెత్త నిల్వలు పేరుకుపోవడంతో అప్పుడప్పుడు చెత్త కలిసిపోవడం తో సమీప ప్రాంత ప్రజలు పొగతో ఇబ్బందులు పడే వారు. ప్రజల ఇబ్బందులు గమనించి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లో చెత్తను రీసైక్లింగ్ చేసి ఎరువు, మట్టి, జల్లెడ చేసి వ్యర్థాలను మరో చోటికి తరలించే విధంగా టెండర్ పిలిచారు. ప్లాస్టిక్ తదితర వాటిని సిమెంట్ ఫ్యాక్టరీల కు పంపించాలి. 



ఈ నేపథ్యంలోనే 2022 లో నంద్యాల డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త, చెదారం తొలగించడానికి అందులో వున్న 65 వేల మెట్రిక్ టన్నులు తొలగించడానికి దాదాపు 5.50 కోట్లు టెండర్ ఆమోదం అయింది. టెండర్ పొందిన కాంట్రాక్టర్ ఏడాది లోపు పూర్తి చేయాల్సి వుంది. కాంట్రాక్టర్ ఏడాదిలో పూర్తి చేయకపోవడం తో మరో ఏడాది అధికారులు రెన్యువల్ చేశారు. ఇటీవల కాలంలో కాంట్రాక్టర్ డంపింగ్ యార్డులో వున్న వ్యర్థాలు మూడు విధాలుగా ప్రాసెసింగ్ చేయాల్సి వున్నా తూ..తూ మంత్రంగా కాసింత జల్లెడ పట్టి వాటిని విడిగా చేయకుండా రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా కుందూ ఒడ్డున గుంతలను లెవెలింగ్ చేస్తున్నారు. కర్నూల్ కు వెళ్ళే ప్రయాణికులు అందరూ ఈ వేస్ట్ ను చూసి ముక్కున వెలువేసుకుంటున్నారు. ఈ తతంగాన్ని మీడియా చెవిన కొందరు వేశారు. పీపుల్స్ మోటివేషన్ న్యూస్ అక్కడికి వెళ్లి పరశీలించింది. 


  లెవెలింగ్ కు కేవలం మట్టి పోయాల్సి వుండగా ప్లాస్టిక్ కవర్లు, పగిలిన సీసాలు, ఆసుపత్రుల నుంచే వచ్చే వ్యర్థాలు అన్ని కలిసినవి గమనించారు. కుందూ కు నీళ్ళు వస్తే అన్ని కలిసిన వ్యర్థాలు కుందూ లో కలిస్తే అనారోగ్యాల భారిన పడటం ఖాయం. కాంట్రాక్టర్ కు డంపింగ్ యార్డులో మూడవ వంతు భాగం తరలిస్తే ఒక బిల్లు ఇచ్చేటట్లు తెలుస్తోంది. నియమ నిబంధనలు తుంగలో తొక్కిన కాంట్రాక్టర్ కు ఈ రోజు మొదటి బిల్లు దాదాపు కోటి 80 లక్షలు ఇచ్చేందుకు అధికారులు సిద్దం అయినట్లు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా కాంట్రాక్టర్ చేసిన పనికి అధికారులు బిల్లు మంజూరు చేస్తున్నందుకు ప్రతిఫలం బాగానే ఇస్తున్నట్లు సమాచారం. ప్రజల ఆరోగ్యం కంటే అధికారుల జేబులు నిండడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సర్జికల్ వేస్ట్ పై కథనాలు వెలువడిన సర్జికల్ వేస్ట్ నియంత్రణ మాత్రం లేదు. ఆ అధికారులకు నెల...నెల ప్రవేటు ఆసుపత్రుల నుంచి లక్షల్లో అందు తున్నట్లు సమాచారం. కొందరు అధికారులు ఒక పెద్ద ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళి అభయహస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ శాఖలో ఆ అధికారులు వచ్చినప్పటి నుంచి మూడు పువ్వులు ఆరుకాయలుగా అన్న చందంగా ఖుషీ ఖుషీగా వున్నట్లు సమాచారం. మున్సిపాలిటీ అధికారులు ఫాగింగ్ చేయకపోవడంతో నంద్యాల జెడ్పిటిసి గోపవరం గోకుల కృష్ణారెడ్డి సొంత డబ్బుతో పట్టణంలో ఫాగింగ్ చేస్తున్నారంటే ఇంత కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. నంద్యాల మున్సిపాలిటీ లీలలు ఎన్ని చూడాలో....మరో దోపిడీ కథనంతో త్వరలో మీ ముందుకు.

Comments

-Advertisement-