పల్లెపల్లెకు బిజెపి గడపగడపకు బిజెపి
పల్లెపల్లెకు బిజెపి గడపగడపకు బిజెపి" పల్లెకు పోదాంలో పాల్గొన్న నంద్యాల జిల్లా కో కన్వీనర్ బిజెపి యువ నాయకులు :కొట్టె మల్లికార్జున
నంద్యాల జిల్లా/ డోన్, ఫిబ్రవరి 09 (పీపుల్స్ మోటివేషన్):-
భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా గావ్ చలో అభియాన్ పథకంను పల్లెపల్లెకు విస్తరించాలని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమప్రభుత్వం అని ప్రజలకు తెలియచేస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. గావ్ చలో అభియాన్ ముఖ్య ఉద్దేశ్యం గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి మొదలు కొని దేశ వ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న పని తీరును ప్రత్యక్షముగా ప్రజలకు తెలియచేసే విధంగా, అలాగే స్థానిక సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలను వెంటనే గుర్తించేలా " పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు బిజెపి "తో ప్రతి ఇంటికి చేరువ కావడం. బిజెపి యువ నాయకులు మరియు నంద్యాల జిల్లా గావ్ చలో అభియాన్ కో కన్వీనర్ కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో మరియు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాలతో, నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షురాలు బై రెడ్డి శబరి, గావ్ చలో అభియాన్ క్లస్టర్ ఇంఛార్జి సావిత్రమ్మ సూచనలతో , నంద్యాల జిల్లా గావ్ చలో అభియాన్ కన్వీనర్ నటేశ్, కో కన్వీనర్ రామకృష్ణారెడ్డి సమన్వయంతో డోన్ అసెంబ్లీ కన్వీనర్ సందు వెంకట రమణ ఆధ్వర్యంలో రూరల్ మండలం అధ్యక్షులు రవికుమార్ సహకారంతో డోన్ నియోజకవర్గం యు.కొత్తపల్లి గ్రామంలో బిజెపి కార్యకర్తగా, యువ నాయకులుగా గావ్ చలో అభియాన్ పథకంలో భాగంగా గ్రామస్థులతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ వికసిత భారత్ కేలండర్ పంపిణీ చేయడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం అండతో ముద్ర లోన్ ద్వారా వీధి వ్యాపారము చేసుకునే వారితో కలిసి వికసిత భారత్ సంకల్ప లక్ష్యం దిశగా కేలండర్ పంపిణీ చేయడం జరిగింది.పీఎం మోడీ సంక్షేమంతో డ్వాక్రా రుణాలతో పాటు, తోపుడు బండ్ల మీద వీధివ్యాపారం చేసుకుంటున్న వారికి,స్వయం శక్తితో అభివృద్ది చెందుతున్న మహిళకు, ప్రభుత్వ రుణం ద్వారా స్వయం సహాయక,ఆర్థిక లోన్స్ తీసుకొని వ్యాపార రంగంలో అభివృద్ది చెందుతున్న యువతకు మోడీ సంక్షేమ కేలండర్ పంపిణీను పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు బిజెపి చేరువలో భాగంగా చేయడం జరిగింది.నర్సరీ పెట్టుకొని పది మందితో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తున్న మహిళను అభినందించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన సచివాలయం వద్ద మరియు కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టిన భారత్ నిర్మాణ ఆరోగ్య కేంద్రం వద్ద మోడీ సంక్షేమ కేలండర్ ను సచివాలయం అధికార్లు మరియు ఆరోగ్య అధికార్లకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా
2024 లోపు పేదలు అందరికీ ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో నిర్మించిన PMAY లబ్ధిదారులకు కేలండర్ పంపిణీ చేసి కేంద్రంలో మరొక్కసారి బిజెపి పార్టీకి, మోడీకి మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది.కేంద్ర ప్రభుత్వం నిధులతో ఇచ్చే పెన్షన్ స్కీమ్ లబ్ధిదారులు , రైతులు ,అవ్వా తాతలతో మాట్లాడుతూ మీరు మోడీకి అండగా ఉంటే మరలా వచ్చేది మన ప్రభుత్వమే అప్పుడు ఇంతకు మించి సంక్షేమం కొనసాగుతుందని పేర్కొంటూ"కేంద్రంలో మరొక్కసారి ఆంధ్రలో ఒక్కసారి బిజెపి రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అదేవిధంగా యు.కొత్తపల్లి గ్రామంలో పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు, ప్రతి ఒక్కరికీ గావ్ చలో అభియాన్ నంద్యాల జిల్లా కో కన్వీనర్ మరియు బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున కృతజ్ఞతలు తెలిపారు.