ఏ రాజకీయ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించడం లేదు...
ఏ రాజకీయ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల గురించి ఆలోచించడం లేదు...
ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు -జె.కోటేశ్వరరావు
కర్నూలు, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని వారి అభ్యున్నతికి కృషి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు.... జె కోటేశ్వరరావు. తెలిపారు గుంటూరు జిల్లా నిడుముక్కల గ్రామంలో నుండి ఫిబ్రవరి 5.వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జె కోటేశ్వరరావు రథయాత్ర చేపట్టారు. అందులో భాగంగా నేడు కర్నూల్ నగరంలోకి రథయాత్ర చేరుకోవడంతో కర్నూలు పట్టణవాసులు ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జె కోటేశ్వరరావు కి స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో జై కోటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను గురించి ఆలోచించడం లేదని అన్నారు. ప్రతి కులానికి ఓ రాజకీయ పార్టీ పుట్టుకొస్తున్నాయి ఏ రాజకీయ పార్టీ అయినా అధికారమలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సీఎం పదవిని ఇచ్చే దమ్ము ఉందా అని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు ఎంతవరకు ఉన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారే తప్ప వారి అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు తమ.. ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దఫలవారీగా సీఎం పదవిని ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు విద్యా వైద్యం సంవత్సరాలలో ఆ పంట ద్వారా ప్రతి వ్యక్తి కోటీశ్వరుడు అయ్యేవిధంగా కృషి చేస్తామని ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు.ఆంధ్ర రాష్ట్ర సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జె.కోటేశ్వరరావు మరియు వారి టీం