యువత భవిష్యత్తును నా భుజాలపై మోస్తా...
political news, tdp news, tg news, kurnool news, ap news
By
Peoples Motivation
యువత భవిష్యత్తును నా భుజాలపై మోస్తా... టీజీ భరత్
కర్నూలు నగరంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు.
డిగ్రీలు, పీజీలు, బీటెక్, ఎంటెక్ చదివిన యువత ఉన్నత ఉద్యోగాల్లో ఉండాల్సింది పోయి ఉద్యోగాల కోసం దిక్కులు చూసే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి.
ఈ పరిస్థితిని మార్చాలంటే సరైన నాయకుడు పాలకుడిగా రావాలి. కర్నూల్లో ఆ బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మా నాన్న టి.జి వెంకటేష్ చేసిన అభివృద్ధి, సహాయ సహకారాలు అందరికీ తెలుసని. ఆయనలాగే మంచి చేయాలన్న సంకల్పంతో నేను కూడా రాజకీయాల్లోకి వచ్చానని మన విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు, ఉన్నత విద్యావంతుడు లోకేష్ నాయకత్వం రాష్ట్రానికి ఎంత అవసరమో వివరించి చెప్పారు. ఆ రోజు దూరదృష్టితో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు ప్రపంచం గర్వించదగ్గ స్థానంలో హైదరాబాద్ నిలిచిపోయిందని. అమరావతిని కూడా అలా అభివృద్ధి చేయాలని ఆయన అనుకున్నారు. ఈ విషయం ఈ తరం వాళ్లందరికీ తెలియాలి.
ఇక రాష్ట్రంలో ఒక్క రాజధాని ఉంటే అభివృద్ధి అదే ప్రాంతంలో ఉంటుందని.. మూడు రాజధానులు ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్న భ్రమను యువతలో తొలగించా. ఒకే ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చంద్రబాబు అనుకుంటే మన కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ జోన్ ఎందుకు ఏర్పాటుచేస్తారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కియా పరిశ్రమను అనంతపురానికి ఎందుకు తీసుకొస్తారు. అభివృద్ధి నలుదిశలా ఉండాలనేదే టీడీపీ పార్టీ సిద్దాంతం అని
అంతేకాకుండా కర్నూలుని ఫార్మా హబ్ గా చేద్దామని ఇదివరకే నారా లోకేష్ తో చర్చించామని తెలిపారు.
నేను గెలిస్తే ఒక పారిశ్రామిక వేత్తగా నాకున్న అనుభవంతో కంపెనీలు తీసుకొచ్చి, ఉద్యోగాలు కల్పించి, ప్రజల ఆదాయాన్ని పెంచుతాను.
ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతున్న నేటి రోజుల్లో యువత అన్ని విషయాలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. లేదంటే ఉద్యోగాల కోసం కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శాంత కుమారి, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments