మీరు చేసిన కబ్జాలపై చర్చకు ఎనీ టైం సిద్ధం
కర్నూలు, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
కాటసాని మీద మేము చేసిన భూకబ్జాల ఆరోపణలను నిరూపించటానికి సిద్ధం. వైసీపీ పాణ్యo ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశం లో మాట్లాడుతు గౌరు దంపతులు భూ కబ్జాలపై నిరధారణ ఆరోపణలు నా పైన చేస్తున్నారు, అధికారులతో కలిసి వస్తాను నా పేరు కానీ నా అనుచరుల పేరు ఉండి నిరూపిస్తే రాజకీయాలకు మరియు నా ఆస్థులు ఇవ్వడానికి సిద్ధం అని ఛాలెంజ్ విసరడం జరిగింది..
ఈ రోజు గౌరు చరిత వెంకట రెడ్డి దంపతులు మాధవి నగర్ స్వగృహాo లో మీడియా సమావేశం నిర్వహించి ప్రూఫ్ లతో బాధితులతో కలిసి మీరు చేసిన కబ్జాల పైన చర్చకు సిద్ధం అని తెలిపిన గౌరు దంపతులు...
![]() |
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న గౌరు దంపతులు |
గౌరు వెంకటరెడ్డి సినియర్ నాయకులు మాట్లాడుతూ...
పాణ్యo నియేజకవర్గంలో
దూపాడు లో 139 సర్వే లో,లక్ష్మీపురం 789 సర్వే లో
హరినాథ్ రెడ్డి ఎన్నారై ప్లాట్ ను కబ్జా
ఓర్వకల్ మండలం వక్ఫ్ బోర్డు భూమి... ఇలా చాలా ఉన్నాయి. ఇవి కొన్ని మాత్రమే ఈ కొన్ని వాటికి మొదటగా చర్చకు వచ్చి బాధితులకు మీరు కబ్జా చేసిన భూమిని వారికీ వ్రాసి బాధితులకు న్యాయం చేయాలనీ తెలిపారు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఛాలెంజ్ నీ స్వీకరిస్తున్నా అని తెలిపారు
గౌరు చరిత మాట్లాడుతూ...
6సార్లు ఎమ్మెల్యే అంటూ చెప్పుకుంటున్న కాటసాని ఏం చేశారో చెప్పాలి..
గోరుకల్లు రిజర్వాయర్ ను 115 కోట్ల తో టిడిపి అభివృద్ది చేశారు.
90 కోట్ల తో ప్రతిపాదనలు ..
టిడిపి హాయంలోనే పాణ్యo డెవలప్ మెంట్ జరిగింది .
మీ హయాంలో ఏం జరిగిందో చెప్పండి.. గొప్పలు చెప్పుకోవడం కాదు...
ఇళ్ల పట్టాలు ఇస్తాం... ఎన్నికల్లో మళ్లీ వైసీపీ కి ఓటు వేయండి కొత్త నాటకం..
ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టడానికి ...
15 రోజులకొకసారి నీరు వస్తున్నాయి . గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. రోజు రోజు నీరు విడుదల చేస్తామన్నారు
మీరు మీ అనుచరులు చేసిన కబ్జాలపై,బాధితులతో కలిసి
ఏనీ టైమ్ చర్చకు సిద్దం...
ఈ మీడియా సమావేశం లో నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,ఓర్వకల్లు మండల నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, గడివేముల మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డ, కల్లూరు మాజీ ఎంపీపీ మాదేష్ తదితరులు పాల్గొన్నారు