రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రాష్ట్రంలో ఏకైక సరస్వతీ దేవి ఆలయం..

Kolanu bharati temple, Saraswati devi temple, vasant Panchami, Saraswati jayanti, traditional news, basant panchami,
Peoples Motivation

రాష్ట్రంలో ఏకైక సరస్వతీ దేవి ఆలయం (కొలనుభారతి):


పురాతన కొలనుభారతి ఆలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు అతిపెద్ద సరస్వతి ఆలయంగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక సరస్వతి దేవి పుణ్యక్షేత్రంగా నిలిచింది. క్షేత్ర ప్రాశస్త్యం, ఆధ్యాత్మిక విశిష్టత,చరిత్ర ఆధారంగా దేశంలో మూడవ భారతి క్షేత్రమే పురాతనమైనదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
Saraswati devi


చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినం అయిన వేడుకలను కొలను భారతి వేడుకలను నిర్వహిస్తారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శివపురం గ్రామ సమీపంలోని నల్లమల అడవి ప్రాంతంలో ఎత్తైన కొండల మధ్యన చారుగోసిని నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పుస్తకధారిణి రూపంలో దర్శనమిస్తారు. ఈ ప్రాంతం ఒకప్పుడు 11-12వ శతాబ్ది కాలానికి చెందిన కళ్యాణ చాళుక్యుల ఆధిపత్యంలో ఉండేదని ఇక్కడున్న శిలా శాసనాల ద్వారా తెలుస్తుంది. సరస్వతి దేవిని వేదమాత, భారతీ, వాగేశ్వరి, శారద, అంబికా చంద్రిక వింధ్యావాసిని అనే పేర్లతో కూడా పిలువబడుతుంది. జ్ఞాన స్వరూపిణి అమ్మవారి జన్మదినం అయిన వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షర జ్ఞానం కలగాలని ఇక్కడ భక్తులు అక్షరాభ్యాసం చేయిస్తారు.
Nallamalla

కొలను భారతీ క్షేత్రం లో సరస్వతి అమ్మవారి ఎదుట మూలవిరాట్ శ్రీ చక్రం ఉండటం విశేషం. ఇక్కడ అమ్మవారి చేతిలో వేదాలు ధరించి పుస్తకపానిగా కనిపిస్తారు నాలుగు కరములు కలిగిన అమ్మవారు ఉత్తరాముకంగా దర్శనమిస్తారు. కుడి రెండు చేతుల్లో పాశం, అభయహస్తం మరియు ఎడమవైపు రెండు చేతుల్లో పుస్తకం, అంకుశం కనిపిస్తాయి.
Water falls


కొలను భారతి క్షేత్రం ఆవరణంలో సప్త శివాలయాలు ఉండటం విశేషం వీటిలో ఒకటి తూర్పుముఖంగా ఉంటుంది దానికి ఉత్తరం వైపు మూడు ఆలయాలు దక్షిణం వైపు మరో మూడు ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నిటికి కలిపి ఒకే ధ్వజస్తంభం ఉండటం విశేషం. ఈ క్షేత్రం ప్రారంభంలోనే గోపాలకృష్ణ స్వామి కొలువయ్యాడు. ఆలయ సమీపంలోని నల్లమల్ల కొండల నుంచి జాలువారి జలపాతాలు సందర్శకులను ఆహ్లాదానికి గురిచేస్తాయి.

ఈ క్షేత్రానికి నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి శివపురం గ్రామానికి బస్సు, ఆటోల సౌకర్యం కలదు. శివపురం గ్రామం నుంచి ఐదు కిలోమీటర్లు అడవి ప్రాంతంలో నడిచి కానీ ఆటోల ద్వారా కానీ చేరుకోవచ్చు.


Comments

-Advertisement-