నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ?
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మెనూ పాటించని ఏజెన్సీలపై చర్యలు...
ఎవరూ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవు
కర్నూలు, ఫిబ్రవరి 22 (పీపుల్స్ మోటివేషన్):-
జిల్లాలో మధ్యాహ్న బోజనం ఖచ్చితంగా మెనూ పాటించాల్సిందేనని అలా పాటించని ఏజెన్సీలపై చర్యలు తప్పవని, సంబంధిత ప్రధానోపాధ్యాయులు మెనూ అమలయ్యేలా చూడాల్సిందేనని ఎవరూ నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి కె.శ్యామ్యూల్ హెచ్చరించారు. నగరంలోని ఐజియంయం పాఠశాల విద్యార్థులు గురువారం ప్లేట్లను పట్టుకుని జిల్లా కలెక్టర్ ను కలసి యండియం నాణ్యత సరిగ్గా లేదంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణచేసి చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో డిఈఓ హుటాహుటిన విచారణ చేసి సదరు ఏజెన్సీపై చర్యలకు ఉపక్రమించారు. పాఠశాల హెచ్ యంకు చార్జీమెమో జారీచేసి విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా డిఈఓ స్పందిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యండియం చేపట్టిందని, నాణ్యమైన పౌష్టికాహారమే లక్ష్యంగా పెట్టుకున్న పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో జిల్లాలో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అలా జరిగితే ఎజెన్సీలు, హెచ్ యంలు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.