సెబ్ సూపరింటెండెంట్ గా భాధ్యతలు చేపట్టిన -ఎస్.రవికుమార్
సెబ్ సూపరింటెండెంట్ గా భాధ్యతలు చేపట్టిన -ఎస్.రవికుమార్
కర్నూలు, ఫిబ్రవరి 02 (పీపుల్స్ మోటివేషన్):-
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలు సెబ్ స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ గా ఎస్.రవికుమార్ భాధ్యతలు చేపట్టారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇంతకు మునుపు పని చేసిన సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ డిసిపి లా అండ్ ఆర్డర్, విజయవాడకు బదిలీ కావడంతో ఆయన స్ధానంలో ఎస్.రవికుమార్ రావడం జరిగింది.
పెనుగోండ అనంతపురం జిల్లా, పుట్టపర్తి సత్యసాయి జిల్లాలలో పని చేశారు. సత్యసాయి జిల్లా, పుట్టపర్తి లో పని చేస్తూ అక్కడి నుండి బదిలీ పై కర్నూలు జిల్లాకు వచ్చారు. జిల్లాలో అక్రమ మద్యం, నాటుసారా, ఇసుక, గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించి అరికడతామని తెలిపారు.
ఎస్.రవికుమార్ గురించి...
స్వస్ధలం... తెలంగాణ రాష్ట్రం, కోడాక్ (మండలం), గనపవరం (పోస్టు) , నల్గొండ జిల్లా, ఎక్సైజ్ ఇన్ స్పెక్టర్ గా 1998 సంవత్సరం లో ఎక్సైజ్ శాఖ లో చేరారు.