వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటాం.
wanaparthy news, political news, mla news, Hyderabad news, ponguleti news
By
Peoples Motivation
వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటాం--ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన మంత్రి
--నాదత్తత నియోజకవర్గం నుండి ఒక వీరుడిని గెలిపించారు
--మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి
వనపర్తి ఫిబ్రవరి 03 ( పీపుల్స్ మోటివేషన్ ):-
తెలంగాణ సచివాలయంలో శనివారం ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవటానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్థానిక నాయకులతో కలిసి వెళ్లారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాదత్తత నియోజకవర్గం నుండి ఒక వీరుడిని గెలిపించారంటూ నాయకులతో హర్షం వ్యక్తం చేస్తూ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ చేశారు.
Comments