రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లన్నిటికీ నా గెలుపే సమాధానం

tg news, Bharath news, kurnool news, kurnool tdp news, local news
Peoples Motivation

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లన్నిటికీ నా గెలుపే సమాధానం

కర్నూలు టౌన్, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-

క‌ర్నూలు న‌గ‌రంలోని అశోక్ న‌గ‌ర్ పంప్ హౌస్ గూడెం కొట్టాల ప్ర‌జ‌ల ఇళ్ల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేది నేనే అనీ నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌ర్నూల్లో సాగిన స‌మ‌యంలో కూడా వీరి స‌మ‌స్య‌ను ఆయ‌న దృష్టికి తీసుకెళ్లాను. ఇళ్ల స‌మ‌స్య‌ను తీర్చేందుకు నారా లోకేష్ తో నేను చ‌ర్చించానని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ టీజీ భరత్ మాట్లాడారు.


దీంతో పాటు విద్యుత్ స‌మ‌స్య‌, మ‌రుగుదొడ్లు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీల్లాంటి క‌నీస మౌలిక స‌దుపాయాలు లేక ఇక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ సమస్యల్ని దగ్గర నుండి చూసి వీటన్నిటిని శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణ‌యించుకున్నా. ఇక‌ ఈ సమస్యలపై పోరాడుతున్న వామపక్షాలు కూడా నిస్వార్ధంగా ప్రజాసేవ చేసే నా నాయకత్వంలోనే కర్నూలు అభివృద్ధి చెందుతుందని గ్రహించి మాతో నిలబడగా, గూడెం కొట్టాల ప్రజలు కూడా నాకు మద్దతిచ్చి మా పార్టీలో చేరారు.ఈ వైసీపీ ప్రభుత్వంలో ఖర్చులు పెరిగాయి కానీ ఆదాయం మాత్రం పెరగలేదు.

ఒక పారిశ్రామికవేత్తగా నాకున్న అనుభవంతో కర్నూలుకు పరిశ్రమలు తెచ్చి, ఉపాధి కల్పించి, ప్రజల ఆదాయాన్ని పెంచుతానని పంప్ హౌస్ గూడెం కొట్టాల ప్రజలందరూ వచ్చే ఎన్నికల్లో మీ ఓటు ముద్రను సైకిల్ పై ముద్రించి నన్ను గెలిపించాలని కర్నూల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

-Advertisement-