కరెంట్ అఫైర్స్...📝
current affairs, daily current affairs, telugu current affairs, education news
By
Peoples Motivation
కరెంట్ అఫైర్స్...📝
ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ, ఆర్.ఆర్.బి., బ్యాంక్, ఎస్.ఎస్.సి, మిగతా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం... తెలుగులో కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాము..
భారత్ కి రానున్న జర్మనీ బస్సులు..
జర్మనీ రవాణా సంస్థ ఫ్లిక్స్ బస్( FlixBus) భారత్లోకి రానున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బస్ మార్కెట్ అయినా భారత్ లో ప్రయాణికులకు తక్కువ ధరకే మెరుగైన ఇంటర్ సిటీ ప్రయాణ అనుభవాన్ని అందించనున్నట్లు తెలియజేసింది.
ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రారంభించే రోడ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ. 99 లకే టికెట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఢిల్లీ నుంచి అయోధ్య, చండీగర్, జైపూర్, మనాలి, హరిద్వార్, రిషికేష్, అజ్మీర్, కత్రా, డెహ్రాడూన్, గోరఖ్పూర్, వారణాసి, జోద్పూర్, ధర్మశాల, లక్నో, అమృత్సర్ వంటి అన్ని ప్రముఖ ప్రాంతాలకు ఈ బస్సులు నడుపుతున్నట్లు తెలియజేసింది.
ఫ్లిక్స్ బస్ సమగ్ర నెట్వర్క్ లో 59 స్టాపులు మొత్తం 200 కనెక్షన్లు ఉంటాయని ఫిక్స్ బస్సు సర్వీస్ ప్రత్యేకంగా BS6 ఇంజన్లతో కూడిన ప్రీమియం బస్సు మోడల్స్ నిర్వహిస్తుంది.
కఠినమైన ఉత్కార నిబంధనలకు పర్యావరణ సుస్థిరతకు ఈ కట్టుబడి ఉంటాయి ఇప్పటివరకు 42 దేశాల్లో ఈ సంస్థ బస్సు సర్వీసులు నిర్వహిస్తుండగా ఇప్పుడు భారత్ 43వ దేశంగా నిలువబోతుంది.
అత్యంత ట్రాఫిక్ రద్దీ గల నగరం గా లండన్
2023 ఏడాదికి సంబంధించి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీగల నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ నిలిచింది.
లండన్ లో పది కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 37 నిమిషాలకు పైగా పడుతున్నట్లు టామ్ టామ్ ట్రాఫిక్ సూచి-2023 వెల్లడించింది. డబ్లిన్ ఐర్లాండ్ టొరెంటో(కెనడా)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్-10 జాబితాలో భారత దేశంలోని బెంగళూరు-6 పూణే-7 స్థానాల్లో ఉన్నాయి.
పేగు క్యాన్సర్ కు టీకా
పింక్ క్యాన్సర్ తొలిదశలో ఉండగానే నయం చేయగల సరికొత్త టీక త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ సర్వే ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ లో పనిచేస్తున్న బ్రిటిష్ ఇండియన్ వైద్యుడు డాక్టర్ టోనీ ఢిల్లీ ఆధ్వర్యంలో దానిపై ట్రైల్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ప్రొఫెసర్ టీం ప్రెస్ తో కలిసి ఢిల్లీలో ఈ టీకాను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా 44 మంది రోగులపై దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నారు.
జీవకోటి మునగడకు ముప్పుగా మారుతున్న ఇథనాల్
శరీరాన్ని నియంత్రించే మెదడు పనితీరుపై ఇతను ప్రభావం చూపుతోందని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) పరిశోధనలో వెల్లడించింది.
మద్యం, పర్ఫ్యూమ్, ప్లాస్టిక్, కాస్మోటిక్స్ వంటి ఇథనాల్ ఉండే ఉత్పత్తుల వినియోగం వల్ల దీర్ఘకాలం పాటు కలిగే పరిణామాలు శరీరంలో మార్పులు నాడీ వ్యవస్థ లో మార్పు విధానంపై సిసిఎంబి పరిశోధకులు అధ్యయనం చేశారు.
ఇలాంటి ఉత్పత్తుల వినియోగం ద్వారా రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని తెలిపారు.
బాలికలకు సైనిక పాఠశాల
సాయుధ దళాలలో చేరి దేశానికి సేవ చేయాలన్న ఆకాంక్ష ఉన్న బాలికల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నగరంలో బృందావనంలో మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ "సంవిద్ గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్" ను రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జనవరి 1న ప్రారంభించారు.
సుమారు ఈ పాఠశాలలో 870 మంది బాలికలతో మొదటి ఆల్ గర్ల్స్ సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సైనిక్ స్కూల్ ను ప్రభుత్వ సంస్థలు ఎన్జీవో రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ రంగ భాగ్యస్వామ్యంతో ప్రారంభించడం జరిగింది.
తొలి డార్క్ స్కై పార్క్ గా పెంచు టైగర్ రిజర్వు
ఒక ఖగోళ పరిశోధన పరిశీలన కేంద్రం చుట్టూ కృత్రిమ కాంతిని అడ్డుకునే అడవి ఉన్నట్లయితే దానిని డార్క్ స్కై పార్క్ అంటారు. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్కుగా మహారాష్ట్ర లోని పెంచు టైగర్ రిజర్వు అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది అయిదో డార్క్ స్కై పార్క్.
కృత్రిమ కాంతిని నిరోధించడం ద్వారా పరిశోధకుల ఖగోళ పరిశోధనలో ఈ పార్క్ ఎంతో ఉపయోగపడుతుంది.
విషయనిపుణులు..✍️
K. MADHU
B.Tech, D.Ed, M.H.R.M, M.Sc (Maths), L.L.B, MJC, CSIR NET, UGC NET,
అక్షర కవి
Comment Poster
Super
Reply to This Comment
User
Comment Poster
Super
Reply to This Comment
Comments