అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యం…..
దేవనకొండ, ఫిబ్రవరి 03 (పీపుల్స్ మోటివేషన్):-
అధికార వ్యసనం,దౌర్జన్య,దోపిడీ దోంగలు అధికారంలో,ప్రతి పక్షంలో ఉండి చేసిందేమి లేదు. మన ఆలూరు నియోజవర్గంలో అధికారం కోసం వైసీపీ,టిడిపి పార్టీలు అరాచకాలు, దోచుకోవటాలు తప్ప గ్రామాల్లో అభివృద్ధి చేయ్యలేదు. ప్రజల ఓట్లు కోసమే ఆ రెండు దోపిడీ,దోంగలు పార్టీలు మరోకసారి దోచుకోవడానికి ప్రజల ముందుకు వస్తున్నారు. అవినీతి, దౌర్జన్య పాలకులకు అంతం లేదు మన బ్రతుకులకు విముక్తి లేదు పల్లెలో నీటి సౌకర్యం కన్నా మద్యం సౌకర్యం అధికంగా ఎరులై పారుతుంది. దేశ అభివృద్ధికి ఆలోచించాల్సిన యువతాను, ప్రజలను, మత్తుకి బానిసలను చేసి చదువుకున్నా విద్యావంతులు తెలివితేటలను నాశనం చేస్తు ప్రశ్నించే తత్వాన్ని బానిసగ చేసుకున్నారు..
వైసీపీ,టీడీపీ పార్టీలకు అధికార వ్యసనం…
ఆ రెండు పార్టీలకు మన నియోజవర్గం అభివృద్ధి మీద ప్రజల సంక్షేమం మీద ఏమాత్రం ధ్యాస ఉందో మనకు అర్థం ఈపాటికి అర్థం అయి ఉంటాది..ఆ పార్టీల మోసపు హామీలకు మరోకసారి మోసపోవద్దు అని పిలుపునిస్తూ దేవనకొండ మండలంలో వేలమకూరు గ్రామం నుండి ప్రారంభమైన గ్రామ,గ్రామన పర్యటనల్లో భాగంగా ప్రజలకు వివరించటం జరిగింది