పోటీ పరీక్షల్లో చూసి రాతలకు పాల్పడితే ఇక పదేళ్ల జైలు శిక్షే
పోటీ పరీక్షల్లో చూసి రాతలకు పాల్పడితే ఇక పదేళ్ల జైలు శిక్షే
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైయిర్ మీన్స్) బిల్లు-2024కు ఆమోదం.
దిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే యుపిఎస్‌సి, ఎస్‌ఎస్‌సి వంటి రిక్రూట్‌మెంట్ పరీక్షలు మరియు నీట్, జెఇఇ మరియు సియుఇటి వంటి ప్రవేశ పరీక్షలలో లీక్‌లు, అక్రమాలు, అలాగే వ్యవస్థీకృత అక్రమాలకు తావులేకుండా తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్ష న్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్) బిల్లు-2024ను శుక్ర వారం పార్లమెంట్ ఆమోదించింది.
సోమవారం (ఫిబ్రవరి 05)లోక్ సభ ఆమోదించిన ఈ బిల్లును శుక్రవారం(ఫిబ్రవరి 09)రాజ్యసభలో ప్రవేశపెట్టారు.ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు తిరస్కరించి ఓటింగ్ నిర్వహించగా, మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. బిల్లుపై చర్చకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిస్తూ... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ పరీక్షలు మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే అన్ని కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా నిర్వహించబడే ప్రవేశ పరీక్షలు “ప్రివెన్ష న్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ బిల్లు, 2024” కవర్ చేస్తుంది." మన దేశ జనాభాలో 70% ఉన్న 40 ఏళ్లలోపు మన యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉంది, యువతను వేధించడానికి ఉద్దేశింది కాదు. ఎవరైతే వారి భవిష్యత్తు, తద్వారా దేశ భవిష్య త్తుతో ఆడుకుంటున్నారో వారిని అడ్డుకోవడానికి మాత్రమే ఈ చట్టం తెచ్చాం" అని పేర్కొన్నారు.