విలేకర్లపై దాడులు చేస్తే ఏ పార్టీలకైనా ఖబర్దార్.....
విలేకర్లపై దాడులు చేస్తే ఏ పార్టీలకైనా ఖబర్దార్.....
-ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్
డోన్, ఫిబ్రవరి 19 (పీపుల్స్ మోటివేషన్):-
అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీ తలపెట్టిన సిద్ధం సభలో ఏబీఎన్ విలేకరి కృష్ణ పై వైసీపీ అల్లరి ముఖాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ డోన్ నియోజకవర్గానికి చెందిన ఏపీ మీడియా ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో డోన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏపీ మీడియా ఫెడరేషన్ అధ్యక్షులు వడ్డే నాగరాజు మాట్లాడుతూ అనంతపురం జిల్లాలోని రాప్తాడు లో సీఎం సభలో ఏబీఎన్ విలేకరి కృష్ణ పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని దీనిని ఏపీ మీడియా ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అందులో భాగంగా. ఈరోజు డోన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి ఆ దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జీవోలు తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఏపీ మీడియా ఫెడరేషన్ సహకారదర్శి జిలాని, నంద్యాల జిల్లా నెంబర్ గంధం శ్రీనివాసులు,ఉపాధ్యక్షులు హిట్లర్,రహంతుల్లా ప్రధాన కార్యదర్శి జగన్,కోశాధికారి ప్రవీణ్, డోన్ సహాయ కార్యదర్శి మణిధర్, మీడియా సలహాదారులు శివరామయ్య ఆచారి,నెంబర్లు నవీన్ శివానందం విక్రమ్ మహమ్మద్ సభ్యులు పాల్గొన్నారు.