గణాంక శాస్త్ర కోర్సుల్లో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి...
గణాంక శాస్త్ర కోర్సుల్లో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయి...
కర్నూలు (పీపుల్స్ మోటివేషన్ న్యూస్):-
జాతీయ గణాంక కార్యాలయం 1950 సంవత్సరం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రణాళికలు పరిశోధన మరియు వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాల రూపకల్పన మరియు వాటి అమలుకు కావలసిన పటిష్టమైన సమాచార వ్యవస్థకు మూలసాధనంగా ఉండడం ద్వారా దేశ సేవలో నిమగ్నమై ఉన్నదని జాతీయ ఉప గణాంక కార్యాలయం కర్నూల్ అధికారిని కె. అమృత తెలిపారు. శుక్రవారం కర్నూలు నగరంలోని స్థానిక సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో NSSO ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన కర్నూలు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి టి. హిమ ప్రభాకర్ రాజు హాజరై గణాంక శాస్త్ర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పలు ఉపాధి అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని తెలిపారు.
NSSO సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ టి సతీష్ బాబు అధికార గణాంకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అధికారిక గణాంకాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో
ప్రథమ బహుమతి రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎస్.అర్చన, బి.సాయి చరిత, ఎస్.నసీరాలకు బహుమతులు అందజేశారు
ద్వితీయ బహుమతి శ్రీ సాయి కృష్ణ డిగ్రీ కళాశాల విద్యార్థులు జి స్నేహిత, కే ప్రసన్నకుమారి, యూ.సీ లక్ష్మీలు.
తృతీయ బహుమతి కర్నూలు డిగ్రీ కళాశాల విద్యార్థులు కే మహేంద్ర, టి వాసు, ఎస్ హేమంత్ లు గెలుచుకున్నారు.
మరియు పాల్గొన్న ఇతర కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది.
అధికార గణాంకాలపై అవగాహన సదస్సు కార్యక్రమంలో సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే శాంతగారు వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ గారు మరియు స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ విభాగాధిపతి శ్రీమతి ఐ కళ్యాణి గారు మరియు NSSO సిబ్బంది ఇతర కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు