ప్రపంచంలోనే అత్యధికం ఓటర్లు కలిగిన దేశంగా భారత్
ప్రపంచంలోనే అత్యధికం ఓటర్లు కలిగిన దేశంగా భారత్
దిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా ఈ ఏడాది దాదాపు రెండు కోట్ల మంది(18-29 మధ్య వయస్సు గల) యువ ఓటర్లను జాబితాలో నమోదు చేసుకున్నట్లు ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల కంటే ఇప్పుడు ఆరు శాతం అధికంగా ఓటర్లు నమోదైనట్లు తెలి పారు. ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగిన దేశంగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 96.88 కోట్ల మంది రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు అని ఈసీ తెలిపింది.
![]() |
Election commission |
ఇంటింటికీ వెళ్లి సమగ్ర ధ్రువీకరణ తర్వాత 67.82 లక్షల మంది చనిపోయినవారి పేర్లు, 22.05 లక్ష నకిలీ ఓట్లను తొలగించినట్లు పేర్కొంది. 88.35 లక్షల మంది దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగిం చుకునేలా పోలింగ్ రోజున సహకారం అందించనున్నట్లు స్పష్టం చేసింది.
దేశ వ్యాప్తంగా 96,88,21,926 కోట్ల మంది అర్హత కలిగిన ఓటర్లు ఉండగా, వీరిలో 49.72 కోట్ల మంది పురుషులు, 47.15 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 2024 నాటికి లింగ నిష్పత్తి 948కి పెరి గింది. ఓటర్ల జాబితా వెల్లడిలో పారదర్శకతపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.