రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఎన్నికల వ్యయం పై శిక్షణ

GENERAL NEWS, TELUGU NEWS, NATIONAL NEWS, ELECTION NEWS
Peoples Motivation

ఎన్నికల వ్యయం పై శిక్షణ

కర్నూలు, (పీపుల్స్ మోటివేషన్):-

రానున్న పార్లమెంటు, శాసనసభ ఎన్నికల సందర్భంగా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చుల నివేదికలు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం పకడ్బందీగా సిద్ధం చేయాలని జిల్లా నోడల్ అధికారి కే.రమేష్ బాబు మరియు యెన్.రామాంజినేయులు శిక్షణార్థులకు సూచించారు.

Images
కలెక్టర్ ఆదేశాల ప్రకారం బుధవారం ఉదయం నగరంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం, కర్నూలు సమావేశ మందిరంలో ఎన్నికల వ్యయము గురించి అసిస్టెంట్ ఎక్ప్ పెండెచర్ అబ్సర్వర్ , అకౌంటింగ్ టీం లకు శిక్షణా తరగతులు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వ్యయ నోడల్ అధికారి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలు, నిబంధనల పుస్తకాలను బాగా చదువుకోవాలని ఏమైనా సందేహాలు ఉంటే వ్యయ నోడల్ అధికారులను సంప్రదించాలన్నారు.

జిల్లా ఆడిట్ అధికారి ఎన్నికల వ్యయ పర్యవేక్షణ నోడల్ అధికారి కే.రమేష్ బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ఖర్చుల రకాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వలెన్స్, వీడియో సర్వలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎక్సైజ్, అకౌంటింగ్, ఎం సి ఎం సి బృందాలు నిర్వహించవలసిన విధులను అసిస్టెంట్ ఎక్ప్ పెండెచర్ అబ్సర్వర్ , అకౌంటింగ్ టీం లకు వివరించారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న అభ్యర్థి 95 లక్షల రూపాయలకు వరకు ఖర్చు చేయుటకు అనుమతి ఉందని, అలాగే శాసనసభ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయుటకు అనుమతి ఉందన్నారు. అంతకుమించి ఖర్చు చేస్తే ఆయా అభ్యర్థులు అర్హత కోల్పోతారన్నారు. 10 లక్షల రూపాయలకు మించి ఎక్కడైనా నగదు పట్టుకున్న పక్షంలో ఆదాయపుపన్ను అధికారులకు తెలియజేసి సీజ్ చేయించాలన్నారు. స్టార్ క్యాంపెనర్ వద్ద ఒక లక్ష రూపాయల వరకు ఉంచుకునేందుకు అనుమతి ఉందన్నారు.

వ్యయ నోడల్ అధికారి ఎన్.రామాంజినేయులు ఈ శిక్షణ తరగతుల లో క్రింది అంశాలు వివరించారు. ఎవరైనా సరే 50 వేల రూపాయలకు మించి నగదు తీసుకెళ్తుంటే పట్టుకోవాలని 10 వేల రూపాయల విలువ చేసే బహుమతులు, వివిధ రకాల వస్తువులు కానీ ఉంటే సీజ్ చేయాలన్నారు ఎక్కడైనా అక్రమంగా నగదు గాని వస్తువులు గాని రవాణా చేస్తున్న, లేదా పంపిణీ చేస్తున్న వెంటనే ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ సిస్టం ఈఎస్ఎంఎస్ యాప్ లో వివరాలు నమోదు చేయాలన్నారు. అన్ని బృందాలు వారికి అప్పగించిన విధంగా అభ్యర్థుల ఖర్చుల వివరాలను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. అభ్యర్థులు వారి ఖర్చులు నివేదికలను మూడుసార్లు వ్యయ పరిశీలకులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచార ప్రకటనలు కోసం తప్పనిసరిగా మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ( ఎం సి ఎం సి )వద్ద ముందస్తుగా అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. చెల్లింపు వార్తలను గుర్తించి అభ్యర్థుల ఖాతాలో ఖర్చు కింద జమ చేయవలసి ఉంటుందన్నారు.

ఈ శిక్షణ తరగతుల్లో సోమశేఖర్ రెడ్డి జోనల్ మేనేజర్ ఏ.పి.ఐ.ఐ.సి, మారుతీ ప్రసాద్ జనరల్ మేనేజర్, డి.ఐ.సి, కర్నూలు వీరి ఎన్నికల వ్యయ అనుభావాలు ఎన్నికల వ్యయ సిబ్బందికి తెలియపరిచారు.

Pics

Comments

-Advertisement-