విద్యుత్ షాక్ వల్ల యువకుడు మృతి..
విద్యుత్ షాక్ వల్ల యువకుడు మృతి
దేవనకొండ, ఫిబ్రవరి 21 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు జిల్లా, దేవనకొండ మండలంలోని బేతపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశ పార్టీ కార్యకర్త బోయసూరి (సురేంద్ర 30 సం. వయసు) విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మృతికి చెందారు. వివరాల్లోకి వెళితే...ఈ మద్య కాలంలో అతని పొలంలో బోరు వేయడం జరిగింది. బోరు వేయించుకున్న మోటార్ కి కొత్త కనెక్షన్ తీసుకోవాలని పనిలో నిమగ్నమై ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ షర్ట్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సురేంద్రకు భార్య మరియు ఇద్దరు కుమారులు ఉన్నారు. చనిపోయిన బోయ సురేందర్ ను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారులు ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ మరియు బిజెపి మండల అధ్యక్షులు మల్లికార్జున మరియు బోర్డర్ రవికుమార్ కోరారు. ప్రజలు విద్యుత్ ప్రవాహం ఆన్లో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.