అవినీతి అక్రమాలను బయట పెడితే విలేకరులపై దాడులు చేస్తారా?
TELUGU NEWS, GENERAL NEWS, POLITICAL NEWS, NATIONAL NEWS
By
Peoples Motivation
అవినీతి అక్రమాలను బయట పెడితే విలేకరులపై దాడులు చేస్తారా?
దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి...
డెమొక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే ఎన్ ఈశ్వర్ రెడ్డి.
రాష్ట్రంలో దేశంలో రోజురోజుకు జర్నలిస్టులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా రాప్తాడు రాప్తాడు లో జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ను విచ్చలవిడిగా కొట్టడం మరవక ముందే, కర్నూలు పట్టణంలోని ఈనాడు ఆఫీస్ పై వైసీపీ అనుచరులు రాళ్లతో కర్రలతో దాడి చేయడం అతి దుర్మార్గమైన చర్యగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కేఎన్ ఈశ్వర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విలేకరులపై దాడులు జరగకుండా భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా అనేక చట్టాలను తెచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు విలేకరులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, జర్నలిస్టులు అనేటువంటి వాళ్ళు నిష్పక్షపాతంగా నిర్భయంగా, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పని చేస్తారే తప్ప అలా పని చేసే వారిపై దాడులు చేయడం సభ్య సమాజం చాలా దించుకునే చర్య అని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎలాంటి అక్రమాలనైనా నిర్భయంగా వార్తలు రాస్తున్నప్పుడు వారిని అభినందించి తమ తప్పులు తెలుసుకుంటే ఆయా రాజకీయ నాయకుల గుణం మహోన్నతంగా ఉంటుందని, అలా లేకుండా పైశాచికంగా జర్నలిస్టులపై దాడులు చేసే వారిని రాక్షసులతో సమానంగా అభివర్ణించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, భూ దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అలాంటి వాటిని పత్రికల్లో, చానల్లో చూపించడం మా జర్నలిస్టుల యొక్క హక్కు అని, ఇలాంటి క్రమంలో అధికార పార్టీ అండదండలతో కొంత మంది ఈనాడు ఆఫీసు పై దాడి చేయడం సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, న్యాయస్థానాలు జోక్యం చేసుకొని విలేకరులకు అండగా నిలవాలని ఆయన కోరారు. ఏ జర్నలిస్టుకు ఏమి జరిగినా మా డీజే యు జాతీయ రాష్ట్ర స్థాయిలో వివిధ జర్నలిస్టు సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని, ఆయన అన్నారు. మా జర్నలిస్టుల ది ఒక కుటుంబం. మేమంతా ఐక్యంగా పోరాడడానికి ఏమాత్రం వెనుకాడం ఇలాంటి దాడులకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజా సంఘాలు జర్నలిస్టులకు అండగా నిలవాలని ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి కోరారు. ఈనాడు ఆఫీసు పై దాడి చేసిన హంతకులను, రాప్తాడు లో ఏబీఎన్ ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన హంతకులను కఠినంగా శిక్షించాలని డి జె యు రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి కోరారు.
Comments