వైసీపీ టీడీపీ రెండు మోసపూరిత ప్రభుత్వాలే..!
వైసీపీ టీడీపీ రెండు మోసపూరిత ప్రభుత్వాలే..!
-బిజెవైమ్ మాజీ అధ్యక్షులు చైతన్య కుమార్
కర్నూలు, ఫిబ్రవరి 18 (పీపుల్స్ మోటివేషన్):-
ఉచిత హామీల పేరుతో అధికారం చేపట్టిన తర్వాత అన్ని వర్గాల ప్రజలను అలాగే యువతను నట్టేట ముంచాయని నంద్యాల జిల్లా బిజెవైమ్ మాజీ అధ్యక్షులు చైతన్య కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి ఎన్నికలు దగ్గర పడుతున్న వేల రెండు పార్టీలు ఒకదానికి మించి మరొకటి సాధ్యం కాని ఉచిత హామీలతో మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సీక్వెల్ రూపంలో ఈ ప్రభుత్వాలు రానున్నాయి అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే ఈ ప్రభుత్వాలు అమలుపరిచి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి. కావున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా యొక్క విన్నపం ఈసారి టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో బిజెపి పార్టీని బలపరిచి ఈ రెండు పార్టీల మెడలు వంచాలి. బిజెపి పార్టీ చేపడుతున్న ప్రజాపోరు-1 విజయంతో మరింత రెట్టింపు ఉత్సాహంతో ప్రజాపోరు రెండో విడత కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చిత్తశుద్ధితో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రజాపోరు రాష్ట్ర కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డికి అలాగే రాయలసీమ కన్వీనర్ పోలంకి రామస్వామికి, ఇతర ముఖ్య నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
![]() |
బిజెవైమ్ మాజీ అధ్యక్షులు చైతన్య కుమార్ |