సెబ్ పోలీసుల దాడులు... కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత..
సెబ్ పోలీసుల దాడులు... కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత...
మొత్తం 100 అక్రమ మద్యం బాక్సులు సీజ్ వాటి విలువ రూ. 8 లక్షల 60 వేలు
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ ఇంకా 5 మందిని అరెస్టు చేయాల్సి ఉంది
పోలీసులను అభినందించిన... జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్
కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు కర్నూలు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ ఇంచార్జ్ అడిషనల్ ఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో కర్నూలు సెబ్ సూపరింటెండెంట్ ఎస్.రవికూమార్ పర్యవేక్షణలో ఎమ్మిగనూరు సెబ్ పోలీసులు సోమవారం కర్ణాటక అక్రమ మద్యం రావాణాపై దాడులు నిర్వహించారు.
కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం ను అక్రమ రవాణా ద్వారా చేస్తున్నారని సమాచారం రావడంతో మంత్రాలయం మండలము తుంగభధ్ర గ్రామంలో నుంచి నారాయణ పురం పోవు రోడ్డునందు గల రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద రూట్ వాచ్ చేయుచుండగా ఒక ఎరుపు రంగు కలిగిన ట్రాక్టర్ వాహనంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన 100 మద్యం బాక్సులు ఉండి ఒక్కొక్క బాక్సులో 96 (90 Ml.) చొప్పున మొత్తం 9600 (90 Ml ) ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్లతో అక్రమ రవాణా చేస్తుండగా స్వాధీనం చేసుకొన్నారు. డ్రైవర్ తో పాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అక్రమం మద్యం ను సరఫరా చేయించుకునే మరో 5 మంది వ్యక్తులను కూడా ఈ కేసులో చేర్చడం జరిగినది.
ఈ దాడులలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.భార్గవ రెడ్డి, ఎస్ఐ ఎన్.సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ గోపాల్, కానిస్టేబుల్స్ లక్ష్మన్న, నరసింహారెడ్డి, భరత్, ఇంటెలిజెన్స్ టీం నరసింహులు, సోమశేఖర్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ దాడులలో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జి.కృష్ణ కాంత్ అభినందించారు.