రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

చరిత్రలో ప్రేమకు చెక్కుచెదరని కొన్ని జ్ఞాపకాలు...

Abdul rahim Khan tomb, conjugal love, tombs, Tajmahal, Tajmahal UNESCO, Bibi ka maqbara, Rani ki vav,tomb of humayun, historical love spots, heritage
Peoples Motivation

చరిత్రలో ప్రేమకు చెక్కుచెదరని కొన్ని జ్ఞాపకాలు..

చరిత్రపుటల్లో ప్రేమకు నిలువెత్తు నిదర్శనం చెక్కుచెదరని జ్ఞాపకాలు, ప్రేమ జ్ఞాపకార్థం నిర్మించిన చారిత్రాత్మక కట్టడాలు ఇప్పటికీ మన దేశంలో కొన్ని ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం...

తాజమహల్: 

Tajmahal

ప్రపంచంలోని అత్యంత అందమైన భవనాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది 1983లో UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. తాజ్ మహల్ భారతదేశంలోని ఆగ్రా వెలుపల యమునా నది దక్షిణ ఒడ్డున ఉన్న సమాధి సముదాయం. దీనిని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1631లో మరణించిన అతని భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించారు. 

హుమాయూన్ టూంబ్స్:

Humayun tombs

దిల్లీలో ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇది. మొఘల్ రాజు హుమాయూన్ తన మొదటి భార్య బేగా బేగమ్ గుర్తుగా క్రీ.శ.1569లో నిర్మాణం ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేశాడు.

రాణీ కీ వావ్: 

Rani ki vav

గుజరాత్ లోని పఠాన్ లో ఉంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద కట్టడంగా గుర్తింపు పొందింది. ఇది సరస్వతి నది ఒడ్డున ప్రపంచంలో అత్యంత ప్రత్యేకంగా నిర్మించిన మెట్ల బావి. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. తన భర్త ఒకటో భీమదేవ రాజు స్మారకంగా రాణి ఉదయమతి నిర్మించింది.

అబ్దుర్ రహీం ఖాన్ ఈ ఖానా టూంబ్:

Abdul rahim Khan ka tomb

తాజ్ మహల్ కట్టడానికి ముందే.. అబ్దుర్ రహీం ఖాన్ అనే రాజు తన భార్య మహాబాను స్మారకార్ధం 1598లో ఢిల్లీలో ఈ కట్టడాన్ని పూర్తి చేశారు. రహేందాస్ గా పిలిచే ఈయన అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో ఒకరు. 

బీబీ కా మఖ్బారా: 

Bibi ka makarba

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఉంది. దీన్ని తాజ్ ఆఫ్ దక్కన్ గా డా పిలుస్తారు. ఔరంగజేబ్ మొదటి భార్య దిల్రాస్ బాను బేగమ్ జ్ఞాపకార్థం తెల్లని పాలరాతితో 1653లో నిర్మించారు. ఇది తాజ్మహల్ ని పోలి ఉంటుంది.


Comments

-Advertisement-