ఆటో డ్రైవర్స్ కు అవగాహన సదస్సు..
ఆటో డ్రైవర్స్ కు అవగాహన సదస్సు..
నంద్యాల, ఫిబ్రవరి 9 (పీపుల్స్ మోటివేషన్):-
రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా..జిల్లా రవాణా శాఖ అధికారులు మరియు పోలీసుల ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్ లకు అవగాహన సదస్సు నిర్వహించారు...
సదస్సు లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆటోలను అతి వేగంగా నడుపుతూ, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా ప్రమాదాల బారిన పడుతున్న సంగటనలను, వివరించారు. ప్రమాదాల్లో వారితో,పాటు ప్రయాణికుల ప్రాణాలు కూడా పోతాయని,ఇరు కుటుంబ సభ్యులకు తీరనివేదన మిగురుతుందన్నారు.ఆటో స్టాండ్ లలో ప్రజలకు, ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగ కుండ ఆటో లు పార్క్ చేయాలని సూచించారు పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను బట్టి ఆటో స్టాండ్ లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
ఆటో ఫిట్నెస్ చూసుకోవాలి
పొగ ద్వారా పొల్యూషన్ వచ్చే ఆటోలను నడపవద్దు
పరిమితికి మించి ఆటోలలో ఎక్కించుకొని నడపరాదు
ముఖ్యంగా స్కూల్ పిల్లలను పరిమితికి మించి ఎక్కించుకోరాదు
ఆటో డ్రైవరు కు వెనుక వాహనాలు కనిపించుటకు ఆటో వెనుక ఎలాంటి ప్రకటనల పోస్టర్లు అంటించరాదు
నంద్యాల సిటి అంతా ప్రయాణికుల దగ్గర ఒకే విదంగా ఆటొ ఛార్జీలు తీసుకోవాలి
చార్జీల విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని కోరారు ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్ ల వద్ద ఫ్రీ లెఫ్ట్ లను జామ్ చేయరాదు, ఆటో లకు కేటాయించబడిన రెండవ లైన్ లో మాత్రమే ఆటొను నడపాలి, ఆటొలను అతివేగంగా మరియు త్రాగి నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని. సూచించారు.
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఎంవిఐ రవిశంకర్ నాయక్, ట్రాఫిక్ సిఐ ఇస్మాయిల్ భాష,11 వ వార్డు కౌన్సిలర్ తమీమ్, రెడ్ క్రాస్ ప్రతినిధి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.