ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ లో కేసు సత్వర పరిష్కారం...
ప్రజా ప్రయోజన సేవల శాశ్వత లోక్ అదాలత్ లో కేసు సత్వర పరిష్కారం...
ఫిబ్రవరి 17, పీపుల్స్ మోటివేషన్ డెస్క్:-
ప్రజలకు తెలియచేయడం ఏమనగా ప్రజా వినియోగ సేవలకు సంబంధించి ఏవైనా కేసులు ఉంటే శాశ్వత లోక్ అదాలత్ ను సంప్రదించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సత్వరంగా పరిష్కరించుకోగలరు. శాశ్వత లోక్ అదాలత్ లో రాజీ ద్వారా కానీ లేదా తీర్పు ద్వారా కానీ కేసు పరిష్కారం జరిగితే, అటువంటి తీర్పుపై అప్పీలు లేదు.
👉ఈ వ్యవస్థ ద్వారా 10 ప్రజా ప్రయోజిత సేవ రంగాలకు సంబంధించిన సేవలలో లోపాల వలన కలుగు నష్టాలను విన్నవించి సంబంధించిన న్యాయం త్వరగా పొందవచ్చును.
👉రవాణా సేవలు: రోడ్డు, విమాన సేవలకు సంబందించి ప్రయాణికులు తరలింపు, సరుకుల రవాణా సేవలు.
👉పోస్టల్, టెలిగ్రామ్, టెలిఫోన్ సేవలు.
👉విద్యుత్, నీటి సరఫరా సేవలు ఏదేని సంస్థ ద్వారా అందించే సేవలు.
👉మునిసిపాలిటీ, గ్రామ పంచాయతీల సంబందించి : మురుగు నీటి కాల్వల నిర్వహణ మరియు ప్రజా పరిరక్షణ లాంటి సేవలు.
👉ప్రజా ఆరోగ్యం, వైద్య చికిత్సా కేంద్రాలు: ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ సేవలు.
👉భీమా సౌకర్యం: జీవిత భీమా, సాధారణ భీమాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జీవిత భీమా, వాహన, పంటల, గృహ భీమా మొదలగు సేవలు.
👉బ్యాంకింగ్, ఇతర ఆర్ధిక సంస్థల సేవలు.
👉జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సేవలు.
👉విద్య, విద్యాసంస్థలు: ప్రభుత్వ, ప్రైవేటు విద్య సంస్థల సేవలు.
👉స్థిరాస్తి వ్యాపారం (రియల్ ఎస్టేట్): ప్లాట్స్ మరియు గృహ నిర్మాణ సేవలు.
ప్రజా వినియోగ సేవల కోసం శాశ్వత లోక్ అదాలత్, కర్నూలు వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.