మరోసారి దాతృత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి
మరోసారి దాతృత్వం చాటుకున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి
రూ.7 లక్షల సొంత డబ్బులతో శ్రీ మద్దిలేటి స్వామి క్షేత్రంలో మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం
గతంలో రూ.8 లక్షలతో మెట్ల మార్గం నిర్మించిన బిసి జనార్దన్ రెడ్డి
భక్తుల సౌకర్యార్థం మొత్తం రూ.15 లక్షల సొంత డబ్బుతో మెట్లు మరియు పైకప్పు నిర్మాణం
హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు
బనగానపల్లె, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
భక్తుల సౌకర్యార్థం నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మి మద్దిలేటి స్వామి వార్ల క్షేత్రంలో మెట్ల మార్గంలో రూ .7 లక్షల సొంత డబ్బులతో పైకప్పు నిర్మాణం చేపట్టి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బీసీ కుటుంబానికి శ్రీ మద్దిలేటి స్వామి వారు ఇంటి దైవం. ఈ ఆలయానికి వేసవి కాలంలో లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం కొన్నేళ్ల క్రితం బీసీ జనార్దన్ రెడ్డి ఆలయ ముందు భాగం నుండి కొండపైకి (బిసి రాజారెడ్డి ఉచిత కూలింగ్ మినరల్ వాటర్ ప్లాంటు వరకు) రూ. 8 లక్షల సొంత డబ్బులతో మెట్ల మార్గాన్ని నిర్మించారు. అయితే వేసవికాలంలో మెట్ల మార్గంలో భక్తులు ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్న విషయం బీసీ జనార్దన్ రెడ్డి దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ఆయన సొంత డబ్బులతో పైకప్పు నిర్మాణం చేపట్టారు. దీనివల్ల వర్షాకాలం వేసవికాలంలో సైతం భక్తులు పడే ఇబ్బందులు తొలగిపోయాయి. బీసీ జనార్దన్ రెడ్డి నిర్మించిన మెట్ల మార్గం దేవుని దర్శనానికి సులువుగా ఉండడంతో భక్తులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.