రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను సందర్శించిన జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి

sss police,Ap police, crime news, Atp police,
Peoples Motivation

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతదేహాలను సందర్శించిన జిల్లా ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి


ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాలలో సంబంధిత అధికారులతో ఆరాతీసిన ఎస్పీ 

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారిపై పోలీస్ కఠిన చర్యలు తీసుకోవాలి...ఎస్పీ ఎస్వీ.మాధవ్ రెడ్డి

శ్రీ సత్య సాయి జిల్లా/అగళి, (పీపుల్స్ మోటివేషన్):-

ఆదివారం అర్ధరాత్రి సమయంలో అగళి మండలంలోని రహదారి లో టాటా ఏసీ మరియు లారీ ఢీ కొనడంవల్ల ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్ర గాయాలు అయిన సంఘటన విధితమే సోమవారం ఈ ఘటన గల కారణాలను అన్ని కోణాలలో పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి.

 హాస్పిటల్లో ఉన్న మృతదేహాలను పోస్టుమార్టం ప్రాంతానికి వెళ్లి సందర్శించిన ఎస్పీ, ఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేసి సంఘటనలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్లో చికిత్సల కోసం తరలించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదానికి దారి తీసిన ఘటన కారణాలను సంబంధిత డీఎస్పీ తో పాటు పలువురు పోలీస్ అధికారుల తో ఆరాదీశారు. జాతీయ రహదారిలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇరిగేపల్లి దగ్గర రెండు వాహనాలు ఢీకొన్నాయి. అందులో ఉన్న 14 మంది లో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

   

Police news

 రోళ్ల మండలం దాసప్పనపాళ్య గ్రామానికి చెందినది  టాటా ఏసీ వాహనం ఆదివారం సాయంత్రం సిరా పక్కనే ఉన్న ఉచ్చగిర్నహళ్లి గ్రామానికి పోయి పెళ్లి సంబరాలు ముగించుకుని తిరిగి తన స్వగ్రామైన ఎంత దశపునపనపాళ్య గ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటుచేసుకుంది హిందూపురం నుంచి వస్తున్న లారీ శిరవైపు పోతుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
Sss police

జిల్లా ఎస్పీ అన్ని కోణాలలో ప్రమాద సంఘటనకు గల కారణాలను సంఘటన స్థలానికి వెళ్లి డిఎస్పీ తో కలిసి విచారించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్న డ్రైవర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని, రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఇప్పటికే పోలీసులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఎస్పీ తెలియజేశారు.

Comments

-Advertisement-