RRB ALP Recruitment 2024 : రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు
RRB ALP Recruitment 2024 : రైల్వేలో 5696 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
•ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ రిక్రూట్‌మెంట్ 2024
•5696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ
•జనవరి 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం
నిరుద్యోగులకు శుభవార్త: భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులను భర్తీ చేయనున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆసక్తిగల అభ్యర్థులు RRB ALP నోటిఫికేషన్ 2024ను RRB అధికారిక ప్రాంతీయ వెబ్‌సైట్లలో చెక్ చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
- మెట్రిక్యులేషన్ / SSLC, గుర్తింపు పొందిన సంస్థల నుండి ఆర్మేచర్ అండ్ కాయిల్ విండర్ / ఎలక్ట్రానిక్స్ మెకానిక్ / ఫిట్టర్ / హీట్ ఇంజిన్ / ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ / మెషినిస్ట్ / మెకానిక్ డీజిల్ / మెకానిక్ మోటార్ వెహికల్ / మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ / మెకానిక్ రేడియో & టీవీ / రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ / ట్రాక్టర్ మెకానిక్ / టర్నర్ / వైర్ మ్యాన్ ట్రేడ్స్ లో NCVT/SCVT లో ITI
- మెట్రిక్యులేషన్/ SSLC, పైన పేర్కొన్న ట్రేడుల్లో కోర్సు పూర్తి చేసిన యాక్ట్ అప్రెంటిస్షిప్,
- మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా,
- ITIకి బదులుగా గుర్తింపు పొందిన సంస్థ నుండి వివిధ స్ట్రీమ్‌ల ఇంజనీరింగ్
- పైన పేర్కొన్న ఇంజినీరింగ్ విభాగాల్లో డిగ్రీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం:
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 19,900 నుంచి రూ.63,200 వరకూ ఉంటుంది.
- జీతంతో పాటు, అభ్యర్థులకు ఏర్పాటు చేసిన నిబంధనల ప్రకారం వివిధ ప్రోత్సాహకాలు మరియు అలవెన్సులను అందుకుంటారు.
వయోపరిమితి:
- దరఖాస్తు చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, వివిధ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపు అందించబడింది.
ఫిజికల్/మెడికల్ స్టాండర్డ్ రిక్వైర్‌మెంట్
- అభ్యర్థులు శారీరకంగా మరియు వైద్యపరంగా దృఢంగా ఉండాలి. మెడికల్ స్టాండర్డ్ A-1 అయి ఉండాలి మరియు అభ్యర్థుల కంటి చూపు క్రింది డేటా ప్రకారం ఉండాలి.
- మెడికల్ స్టాండర్డ్ A-1ఫిజికల్ స్టాండర్డ్ అన్ని ప్రమాణాలతో శారీరకంగా దృఢంగా ఉండాలి.
విజన్ స్టాండర్డ్
•దూరదృష్టి: 6/6, 6/6 ఫాగింగ్ టెస్ట్ తో కళ్లజోడు లేకుండా (+2Dని అంగీకరించకూడదు)
•నియర్ విజన్: Sn: 0.6. 0.6 అద్దాలు లేకుండా
•కలర్ విజన్ బైనాక్యులర్ విజన్, ఫీల్డ్ ఆఫ్ విజన్, నైట్ విజన్, మెసోపిక్ విజన్ తదితర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
ఎంపిక విధానం :
- ఎంపిక ప్రక్రియ క్రింద చూపిన విధంగా 4 దశలను కలిగి ఉంటుంది మరియు అన్ని పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో నిర్వహించబడతాయి.
- దశ I CBT
- దశ II CBT
- కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT)
- పత్రాల ధృవీకరణ
- వైద్య పరీక్ష.
దరఖాస్తు ఫీజు
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్-సర్మీస్‌మెన్, మహిళలకు రూ.250.. మిగిలిన వారికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
ఖాళీల వివరాలు
- అహ్మదాబాద్-238
- అజ్మీర్-228
- అలహాబాద్-473
- బెంగళూరు-219+65
- భోపాల్-280
- భువనేశ్వర్-124+1192
- బిలాస్పూర్-66
- చండీగఢ్-148
- చెన్నై-43
- గోరఖ్‌పూర్-62
- గౌహతి-39
- జమ్మూ శ్రీనగర్-254+91
- కోల్‌కతా-161+56
- మాల్దా-547
- ముంబై-38
- ముజఫర్‌పూర్-38
- పాట్నా-652
- రాంచీ-153
- సికింద్రాబాద్-758
- సిలిగురి-67
- తిరువనంతపురం-70
- మొత్తం -5696 ఖాళీలు.
ముఖ్యమైన లింక్స్
- మరి కొన్ని వివరాలకు RRB అధికారిక వెబ్‌సైట్ సందర్శించగలరు. https://indianrailways.gov.in/
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అంతటా అభ్యర్థులు తప్పనిసరిగా తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడిని యాక్టివ్‌గా ఉంచుకోవాలి.