రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్న ఆటోలు సీజ్ RTO కు 70,800 జరిమాన అప్పగింత

POLICE NEWS, RTO NEWS, TRAFFIC POLICE NEWS, NANDYAL NEWS, AP NEWS, TRAFFIC RULES
Peoples Motivation

పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్న ఆటోలు సీజ్  RTO కు 70,800 జరిమాన అప్పగింత

నంద్యాల, ఫిబ్రవరి 15 (పీపుల్స్ మోటివేషన్):-

వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి,లేకుంటే చర్యలు తప్పవు -జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి 

Sp ndl

నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు నివారణలో భాగంగా నేడు నంద్యాల మూడో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు ఆద్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టగా పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తున్న ఏడు ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పరిమితికి మించి ప్రయాణికులను చేరవేస్తూ, ప్రమాదానికి గురౌతు ప్రాణాలుకోల్పోతున్నారని ట్రాఫిక్ ,రోడ్డు భద్రతా నియమాల గురించి ఎన్నిసార్లు చెప్పినా,అవగాహన సదస్సులు సమావేశాలు నిర్వహించిన మాట వినని వాహనదారులపై చర్యలు తీసుకున్నామని అందులో భాగంగా నంద్యాల మూడో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహులు ఆద్వర్యంలో వారి సిబ్బంది సహాయంతో ఏడు ఆటోలను సీజ్ చేసి ఆర్టీవో కి అప్పగించారు. సదరు ఆర్టీవో వారు సీజ్ చేసిన ఏడు ఆటోలకు 70,800 జరిమాన విధించారు. కావున వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ ,రోడ్డు భద్రతా నిభందనలు పాటించాలని లేనిఎడల పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.ఇలాగే మరోసారి పట్టుబడితే వారి లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. మరియు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్,రోడ్డు భద్రతా నిభందనలు పాటించాలని లేనియెడల పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Comments

-Advertisement-