మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు...ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల..
AP TET Results,AP TET 2024 Results,AP TET official website,AP TET notification 2024,
APTET apcfss in candidate login,
AP TET latest News Today,
TS TET
By
Peoples Motivation
మార్చి 14న ఏపీ టెట్ ఫలితాలు...ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫిబ్రవరి 27వ తేదీ నుంచి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 3వ తేదీ వరకు జరిగిన పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీలతోపాటు రెస్పాన్స్ షీట్లను కూడా విద్యా శాఖ తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు టెట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీలను, రెస్పాన్స్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో అభ్యర్థి ఐడీ, పుట్టినతేదీ, వెరిఫికేషన్ కోడ్ వివరాలు నమోదు చేసి రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాథమిక ఆన్సర్ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను తెలియజేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఫలితాలు మార్చి 14న విడుదల కానున్నాయి. కాగా డీఎస్సీ పరీక్షల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
Comments