రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పండుగ వేడుక‌ల్లో అప‌శ్రుతి...14 మంది చిన్నారుల‌కు క‌రెంట్ షాక్‌తో గాయాలు..

Latest crime news in Telugu, daily crime news in Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news Telugu
Peoples Motivation

పండుగ వేడుక‌ల్లో అప‌శ్రుతి...14 మంది చిన్నారుల‌కు క‌రెంట్ షాక్‌తో గాయాలు

పండుగ వేడుకల్లో రాజ‌స్థాన్‌లోని కోటాలో విషాద ఘ‌ట‌న‌

గాయ‌ప‌డిన వారిలో ఇద్ద‌రు చిన్నారుల ప‌రిస్థితి విష‌మం

ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్ వెల్ల‌డి

హైటెన్ష‌న్ ఓవ‌ర్ హెడ్ విద్యుత్ లైన్ కార‌ణం కావొచ్చ‌ని పోలీసుల అనుమానం

కోటా, (పీపుల్స్ మోటివేషన్):-

రాజ‌స్థాన్‌ రాష్ట్రంలోని కోటాలో విషాద ఘ‌ట‌న జ‌రిగింది. మ‌హా శివ‌రాత్రి పండుగ‌ వేడుక‌ల్లో అప‌శ్రుతి చోటు చేసుకుంది. క‌రెంట్ షాక్‌తో గాయల‌యిన చిన్నారుల‌ను వెంట‌నే చికిత్స కోసం స‌మీపంలోని ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే గాయాలయి చికిత్స పొందుతున్న 14 మందిలో ఇద్ద‌రు చిన్నారుల ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.

ఈ ఘటన పై మంత్రి హీరాలాల్ మీడియాతో మాట్లాడుతూ... ఇది చాలా బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న అని అన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయ‌ప‌డ‌డం క‌లిచి వేసింద‌ని తెలిపారు. ఓ చిన్నారికైతే 100 శాతం కాలిన గాయాలు ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. మిగిలిన వారికి 50శాతం కంటే త‌క్కువ కాలిన గాయాలు అయిన‌ట్లు చెప్పారు. ప్ర‌త్యేక వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. క‌రెంట్ షాక్‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు హైటెన్ష‌న్ ఓవ‌ర్ హెడ్ విద్యుత్ లైన్ కార‌ణం కావొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. మంత్రి మాట్లాడుతూ... పండుగ వేడుకల్లో తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ‌ ఉండాలని తెలిపారు.

Rajasthan kota news

Comments

-Advertisement-