డోన్ అడ్డ నాదే పోటీలో ఉండేందుకు సిద్ధం...
డోన్ అడ్డ నాదే పోటీలో ఉండేందుకు సిద్ధం...
ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమం...
భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తలతో అభిప్రాయాలు సేకరణ...
-ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి
డోన్, మార్చి 02 (పీపుల్స్ మోటివేషన్):-
ఇటీవల పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితాలో డోన్ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ సుబ్బారెడ్డి కి కాకుండా కేంద్ర మాజీ మంత్రి కోట సూర్య ప్రకాష్ రెడ్డికి సీటు కేటాయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే డోన్ పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన "భవిష్యత్తు కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా డోన్ పట్టణంలో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి వారి స్వగృహం నుండి ర్యాలీగా బయలుదేరి పాత బస్టాండ్ మీదుగా టిడిపి ఆఫీస్ చేరుకోని భవిష్యత్తు కార్యాచరణ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యాచరణకు డోన్ పట్టణ టిడిపి అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా భవిష్యత్తు కార్యాచరణ పై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర, నియోజకవర్గ టిడిపి సలహాదారుల కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ గౌడ్, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా టిడిపి బీసీ సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున, నంద్యాల జిల్లా టిడిపి కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు, డోన్ పట్టణ సమన్వయ కమిటీ చైర్మన్ అలా మల్లిఖార్జున రెడ్డి, అడ్వకేట్ మధుసూదన్ గౌడ్, అడ్వకేట్ లక్ష్మిశెట్టి క్రిష్ణప్రసాద్, బేతంచేర్ల మండలం టిడిపి సమన్వయ కమిటీ చైర్మన్ ఉన్నాం చంద్రశేఖర్, టిడిపి నాయకులు పెద్దపూదేళ్ళ ప్రసాద్ రెడ్డి, టిడిపి నాయకులు వేంకటేశ్వర రెడ్డి, అంకిరెడ్డి, బేతంచేర్ల పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్షావళి చౌదరి, డోన్ మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు, ప్యాపిలి మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ప్యాపిలి పట్టణ టిడిపి అధ్యక్షులు భూశెట్టి చిన్న సుంకయ్య, క్లస్టర్ ఇంచార్జ్ దానం మధు, బేతంచేర్ల టిడిపి కౌన్సిలర్ లు, తెలుగుయువత కమిటీ నాయకులు, అనుబంధ కమిటీ నాయకులు మరియు డోన్ నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.