భూదేవిలా సహనం, ఓర్పు, పండుటాకుల ప్రపంచం...ఈ రోజు మీ ముందుకు ఓ అమ్మ కథ
భూదేవిల సహనం, ఓర్పు, పండుటాకుల ప్రపంచం...ఈ రోజు మీ ముందుకు ఓ అమ్మ కథ
ఒకరు ప్రాణం పోసేవారు...మరొకరు ప్రాణాలు కాపాడేవారు.
పండుటాకుల ప్రపంచం" స్నేహా వృద్ధాశ్రమం
తల్లి,తండ్రి,అక్క,చెల్లి,కూతురుల సేవే పరమావధి కి ప్రతిరూపం సావిత్రమ్మ.
వృద్ధుల అమ్మ..."సావిత్రమ్మ" కు ఘన సన్మానం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో సావిత్రమ్మ కు ఘన సన్మానం.
నంద్యాల, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రపంచంలో మహిళలు శాంతంగా ఉంటే భూదేవితో పోల్చుతారు. భూదేవిలా సహనం, ఓర్పు ఉన్న మహిళలు సాధారణంగా కనిపిస్తారు. కుటుంబంలో చిన్న, చిన్న పనులు చెపితేనే కోపంగా చూస్తూ, కసురుకునే పరిస్థితులు చూస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారు వుంటే వారికి వృద్ధాప్యంలో సేవలు చేయాలంటే అయిష్టంగా ఉండే రోజులు. ముద్దు, మురిపాలు, లాలించి, జన్మనిచ్చి, ప్రయోజకులు చేసిన తల్లిదండ్రులను కొందరు చివరిదశలో బారం అవుతున్నారని కొందరు తల్లిదండ్రులను విడిచి విదేశాలకు వెళితే, మరి కొందరు వృద్దాశ్రమాలలో విడిచిపెడితే. తల్లిదండ్రుల ప్రేమను వదులుకున్నారు, తోడు లేకుండా వృద్యప్యంలో వారి మనోవేదనను పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఇప్పటికీ అవసరం లేదు. ప్రతి ఒక్కరూ రంగుల ప్రపంచంలో బాల్యం, యవ్వనం, వృద్యాప్యం అనుభవించాల్సిందే. పండుటాకుల దశలో కన్న పిల్లలు దూరం చేస్తే ఆ తల్లిదండ్రుల భాధలు అన్నీ ఇన్ని కావు. నవనందుల నంద్యాల ప్రజలకు అమ్మలా అవతరించిన శాంత మూర్తి సావిత్రమ్మ పండుటాకుల ప్రపంచం స్నేహ వృద్ధాశ్రమం నెలకొల్పి భూదేవిలా శాంతంగా ఉన్న అమ్మల పేరు తెచ్చుకున్నారు. నంద్యాల నవ నందులు, రాజకీయ, వ్యాపార, విద్యా, వైద్యం, కళారంగం, సేవకు నంద్యాల కు వన్నె తీసుకొచ్చారు. సమాజంలో ప్రతి కుటుంబంలో సమస్యలేని కుటుంబం లేదు. పుట్టిన రోజు నుంచి కష్టాలు, సుఖాలు అనుభవించాల్సిందే, చిన్నతనం, పెళ్లి, వృద్యాప్యం సహజమే. వృద్యాప్యంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా మేము ఉన్నామంటూ కొన్నేళ్ల క్రితం స్వామి రెడ్డి, సావిత్రమ్మ దంపతులు ఒక కొట్టంలో స్నేహ వృద్ధాశ్రమం నెలకొల్పారు. ముగ్గురు, నలుగురితో ప్రారంభించిన అనతి కాలంలోనే ఆ కుటుంబం ఎవరూ చేయలేని సేవలు చేస్తుండడంతో వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. ప్రజలు, దాతల సహయంతో పట్టణ శివారు ప్రాంతంలో కొంత భూమి నీ కొనుగోలు చేసి అన్ని హంగులతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆశ్రయం పొందుతున్న పండుటాకులకు కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా వారికి తల్లి, తండ్రి, అక్క, చెల్లి, కూతురు అందరూ తానై చూస్తున్నారు. అమ్మ కానీ అమ్మల శాంతం, ఓర్పు, సహనంతో ఆరోగ్య రీత్యా, ఆహార రీత్యా అన్నీ దగ్గరుండి చేస్తున్నారు. సావిత్రమ్మ సేవకు అటు భర్త స్వామి రెడ్డి ప్రోత్సాహంతో పాటు కొడుకులు, కోడళ్ళు సైతం ఉన్నత చదువులు చదివినా దాంట్లో తృప్తి పడతామని వృద్దులకు సేవ చేయడంలో వారి పాత్ర పోషిస్తున్నారు. ప్రాణాలు పోసేవారు ఒకరు, ప్రాణాలు కాపాడే వారు ఒకరు అన్నైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నంద్యాల వైద్య సంఘం మహిళా వైద్యుల అధ్వర్యంలో వృద్ధుల అమ్మ సావిత్రమ్మకు ఘనంగా సన్మానించారు. సమాజంలో ప్రాణం పోసేవారు వైద్యులు దేవుడితో సమానం. చివరి దశలో అందరికీ అమ్నాలా ప్రాణం కాపాడే అమ్మకు సన్మానం హర్షించదగ్గ విషయం. సేవకు అంకితం ఆయన ఈ కుటుంభానికి రెండు చేతులు ఎత్తి ముక్కినా తక్కువే.