సమస్య ఎక్కడుంటే ఆ సమస్యకు పరిష్కారం నేనే అవుతా... విరూపాక్షి
సమస్య ఎక్కడుంటే ఆ సమస్యకు పరిష్కారం నేనే అవుతా...
సొంత నిధులతో నీటి సమస్యకు పరిష్కారం...
ప్రజలు నీటి కొరకు ఇబ్బంది పడకూడదు..
-ఆలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుసినే విరుపాక్షి
ఆలూరు/చిప్పగిరి, మార్చి 10 ( పీపుల్స్ మోటివేషన్ ):-
ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి నీటి సమస్యను దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం ట్యాంకర్లతో సొంత నిధులతో మంచినీటిని తరలించి చిప్పగిరి మండలం ప్రజల దాహార్తిని తీర్చిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే విరుపాక్షి.
ఈ సంవత్సరం కూడా రాబోయే వేసవి కాలములో ప్రజలు నీటి కొరకు ఇబ్బంది పడకూడదని, బాధ పడకూడదు అని ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడానికి తన సొంత నిధులతో హంద్రీనీవా కాలువ నుండి ఖాజీపురం రిజర్వాయరుకు ట్రాక్టర్ల మోటార్లతో నీటిని నింపి చిప్పగిరి గ్రామ ప్రజల మంచినీటి దాహార్తిని తీర్చారు. ఈ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తుమని సమస్య ఎక్కడుంటే ఆ సమస్యకు పరిష్కారం నేనే అవుతా అని బుసినే విరుపాక్షి అన్నారు.