విద్యార్థిని ఆత్మహత్య...గౌతమి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలి...
విద్యార్థిని ఆత్మహత్య...గౌతమి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య నిర్లక్ష్య వైఖరిపై చర్యలు తీసుకోవాలి...
సిరి అనే విద్యార్థిని ఆత్మహత్య పై విచారణ చేపట్టాలి...
ప్రొద్దుటూరు, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్):-
ఈరోజు అనగా 21-03-2024 వ తేదీ, గురువారం గౌతమి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న సిరి అనే విద్యార్థిని మధ్యాహ్నం దాదాపు 3 గంటల సమయంలో కళాశాలలోని పై విద్యార్థిని ఆత్మహత్య ఒక తరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం చాలా అనుమానాలకు దారి తీస్తుందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కార్యదర్శి జి. వల రాజు ప్రశ్నించారు. విద్యార్థిని మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తరగతి గదిలోనీ ఫ్యాన్ కు వురి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడితే యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు గానీ, విద్యార్థిని తల్లి తండ్రులకు గానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, గుట్టు చప్పుడు కాకుండా విద్యార్థినిని హాస్పిటల్ కు తరలించి, విద్యార్థిని మరణించింది అని చెప్పడం మరియు దీనిపై కళాశాల యాజమాన్యం ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంపై విద్యార్థిని మరణంపై పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావున దీనిపై విచారణ జరిపి, కళాశాల యాజమాన్యం పై తగిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థిని మరణానికి గల కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.