శేషారెడ్డి విగ్రహం ఏర్పాటు విరమించుకోవాలి...
శేషారెడ్డి విగ్రహం ఏర్పాటు విరమించుకోవాలి...
డోన్, మార్చి 06 (పీపుల్స్ మోటివేషన్):-
డోన్ పట్టణం పాత బస్టాండ్ లో ఆర్థిక శాఖ మంత్రి రాజారెడ్డి వాళ్ళ శేషారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని. ఆ విగ్రహ ఏర్పాటు విరమించుకోవాలని అఖిల భారత యువజన సమస్య ఏవైఎఫ్ ఆధ్వర్యంలో డోన్ మున్సిపల్ కమిషనర్ జయరాం కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి విజయ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోజ్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి రాఘవేంద్ర, రజాక్ లు మాట్లాడుతూ.. భగత్ సింగ్ భరతమాతను బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడం కోసం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్, రాజు గురుదేవులు ఉరికంబాన్ని ఎక్కించి
భారతదేశ స్వతంత్ర పోరాటానికి ఊపిరి పోసారని అటువంటి భారతదేశ స్వతంత్ర పోరాట అమరవీరుల విగ్రహాలు ఏర్పాటు చేయడం వల్ల యువతలో చైతన్యం చైతన్య స్ఫూర్తి పెరుగుతుందని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పాలకులు అటువంటి చైతన్యస్ఫూర్తినింతే స్వతంత్ర పోరాట అమరవీరుల విగ్రహాలు ఏర్పాటు చేయకపోగా కులం మతం పేరుతో అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు దాచుకున్న రాజకీయ నాయకుల ఎమ్మెల్యేల విగ్రహాలు వీధికొక విగ్రహం ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారని. ఇటువంటి విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారని తక్షణమే పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసినటువంటి శేషారెడ్డి విగ్రహం ఏర్పాటును విరమించుకొని అక్కడ వెంటనే భగత్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో విగ్రహావిష్కరణ అడ్డుకుంటాం అవసరమైతే ఆ విగ్రహాన్ని తొలగించడానికి ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ వెనకాడదని హెచ్చరించడం జరిగింది.