పేదలందరికీ ఇళ్ల హక్కు పత్రాలను పంపిణీ -ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
పేదలందరికీ ఇళ్ల హక్కు పత్రాలను పంపిణీ
-ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
డోన్, మార్చి 02 (పీపుల్స్ మోటివేషన్):-
కృష్ణగిరి, పత్తికొండ, ఆలూరు, దేవనకొండ, గిద్దలూరు నుంచి టీడీపీ సమావేశానికి వచ్చారు.
టీడీపీ స్థానిక సమావేశం స్థానికేతరులతో నిండిపోయింది.
ఇద్దరు ప్రత్యర్థులు గతంలో ఒక్కటై ఉంటే వందల ప్రాణాలు నిలబడేవి
ఇంత మంది ప్రాణాలు కోల్పోయేలా చేసి ఒక్కటైన మీ కుట్రల కూటమిని ప్రజలు నమ్ముతారా?
ప్రజలకు ఉపయోగపడే పనులు అభివృద్ధి కాదు..వాళ్లిద్దరూ ఒక్కటవడమే అభివృద్ధా?
కూరగాయల మార్కెట్, ఆస్పత్రి, రహదారుల నిర్మాణం అభివృద్ధా అనడిగే ప్రతిపక్షాల వల్ల ప్రజలకేం ఉపయోగం?
ఒకే వేదికపైకి వచ్చి ఒక్కటయ్యామని చెప్పటమా అభివృద్ధి?
వందలాది ప్రాణాలు పోకుండా గతంలో ఒక్కటై ఉంటే డోన్ అంతో ఇంతో అభివృద్ధి చెందేది.
డోన్ లో 5వేల మంది లబ్ధిదారులకి సంపూర్ణ హక్కు కల్పిస్తూ పత్రాల పంపిణీ
రాష్ట్రమంతటా సెంటు స్థలం, డోన్ లో మాత్రం సెంటున్నర పట్టాలిచ్చాం
ప్రత్యర్థులు ఒక్కటైనా ఇతర ప్రాంతాల నుంచి సభకు ప్రజలు రావడంలో మర్మేంటి.
స్థానికులు నమ్మడం లేదనే కదా? ఇక్కడవాళ్లు విశ్వసించడం లేదనే కాదా..ప్రజల కోసం కలిసి పని చేయకుండా అమాయకుల ప్రాణాలు తీశారు.ఇప్పుడు కూడా ప్రజల కోసం ఒక్కటి కాలేదు..ఎన్నికల కోసమే కలిశారు.ఎలాగైనా కలిసి అధికారంలో రావాలనే ఎజెండా మినహా ప్రజలకోసం ఫలానా చేస్తామని చెప్పలేదే.రుణాల మాఫీ, ఉచిత సిలిండర్లు, ప్రయాణీకులకు రాయితీ అని చెప్పి టీడీపీ మోసం చేసింది.నవరత్నాల హామీ ఇచ్చి పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది.వైఎస్ఆర్సీపీ ప్రజలకు మంచి చేస్తే అభివృద్ధి కాదు..మేమిద్దరం ఒకటయ్యాం అదే డోన్ టీడీపీ అభివృద్ధి.పేద ప్రజలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ విధానం
అర్హులైన అందరికీ కుల,మత, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమం అందించాం.
ప్లాట్లు కబ్జా, బ్లేడ్ బ్యాచ్, సెల్ ఫోన్ లు, బైక్ లు ఎత్తుకుపోయిన పాలన అందించిన మీరా అభివృద్ధి గురించి మాట్లాడేది?
ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ బయటుండాలి, తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలి.
ప్రభుత్వం వల్ల మంచి జరిగుంటేనే మాకు మళ్లీ ఓట్లేసి ఆశీర్వదించమన్న ముఖ్యమంత్రి సీఎం జగన్. ఈ కార్యక్రమంలో హాజరైన మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, ఏపీఐఐసీ డైరెక్టర్ బోరెడ్డి పుల్లారెడ్డి, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, ప్యాపిలీ జెడ్పీటీసీ శ్రీరాములు, ఆర్డీవో మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జయరాం, తదితరులు పాల్గొన్నారు.