రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాన్ని చూసి స్పందించిన ఎమ్మెల్యే
మానవత్వం చాటుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మెఘారెడ్డి
వనపర్తి, మార్చి 13 ( పీపుల్స్ మోటివేషన్):-
బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పెబ్బేరు మండలం తోమాలపల్లి నుంచి కొత్తకోట వెళ్తుండగా జాతీయ రహదారి 44 రాయినిపేట స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న దృశ్యాన్ని చూసి వెంటనే తన కాన్వాయిని ఆపి సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితులను పరామర్శించారు.ఈ ప్రమాదంలో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన నరసింహ (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ అనే యువకుడికి కాలు విరిగింది.కాలు విరిగిన బాధితున్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని బంధువులు తెలియజేయడంతో వెంటనే స్పందించిన ఆయన ఆసుపత్రి వర్గాలకు సమాచారం అందించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
అనంతరం ప్రమాదానికి జరిగిన కారణాలను ఆయన తెలుసుకోగా అప్పరాల గ్రామానికి చెందిన నరసింహ కుటుంబంతో సహా వనపర్తి మండలం నాగవరం గ్రామంలో బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా రాయినిపేట బస్ స్టాప్ వద్దకు రాగానే తాను ప్రయాణం చేస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బస్ షెల్టర్ ను ఢీకొనడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడని బంధువులు తెలియజేశారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.