కౌన్సిలింగ్ విధానాన్ని అపహాస్యం చేసే ప్రభుత్వ సిఫార్సు బదిలీలు రద్దు చేయాలి - యుటిఎఫ్
కౌన్సిలింగ్ విధానాన్ని అపహాస్యం చేసే ప్రభుత్వ సిఫార్సు బదిలీలు రద్దు చేయాలి - యుటిఎఫ్
డోన్, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):-
పట్టణంలో ఉపాధ్యాయులు పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సిలింగ్ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ప్రభుత్వ సిఫార్సు బదిలీలు రద్దు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర మాజీ గౌరవాధ్యక్షులు నరసింహుడు, జిల్లా కార్యదర్శులు బి వై సుబ్బరాయుడు,నరసింహారెడ్డి,జన విజ్ఞాన వేదిక నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్యం శెట్టి,డోన్ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్,సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ డిమాండ్ చేశారు. యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డోన్ డివిజన్ ఆధ్వర్యంలో డోన్ మండల విద్యాధికారి కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ విధంగా సిఫార్సు బదిలీలు చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందా అని ప్రశ్నించారు.ఉపాధ్యాయుల కోరిక మేరకు బదిలీలు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం అదే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు వద్దని చెప్తున్న 117 జిఓ ని,అప్రంటిస్ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిగే కౌన్సిలింగ్ విధానానికి తూట్లు పొడిచే ప్రభుత్వ సిఫార్సు బదిలీలు వెంటనే రద్దు చేయాలని లేకుంటే ప్రభుత్వం తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రమేష్ నాయుడు,సర్వజ్ఞ మూర్తి, గౌరమ్మ, శంషాద్ బేగం, జీవి శ్రీనివాసులు, ప్రసాద్, వేణుగోపాల్, సంజీవ రాయుడు, శ్రీనివాసరెడ్డి, రామాంజనేయులు, దాసు, మద్దిలేటి, శ్రీనివాసులు, రహీం, రామకృష్ణ , అంజనప్ప తదితరులు పాల్గొన్నారు.