ప్రశాంత ఎన్నికలే లక్ష్యం... ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి...
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం...
- ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి...
- ప్రజల్లో ధైర్యాన్ని నింపేదుకే ఫ్లాగ్ మార్చ్...
- కర్నూల్ పట్టణంలో కేంద్ర సాయుధ బలగాల తో పోలీసుల కవాతు..
- -కర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్
కర్నూలు, మార్చి 09 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో కలిసి కర్నూల్ రెండవ పట్టణ పోలీసులు కర్నూల్ పట్టణంలో కవాతు నిర్వహించారని కర్నూల్ జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలు-2024 దృష్టిలో ఉంచుకొని కర్నూల్ డీఎస్పీ కె విజయ శేఖర్, ట్రైన్ డీఎస్పీ భావన, కర్నూల్ టూ టౌన్ సీఐ ఇంతియాజ్ భాషా ఆధ్వర్యంలో కర్నూల్ సబ్ డివిజన్ , కర్నూల్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్నూల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కొత్తపేట, కొండ రెడ్డి బురుజు, కోర్ట్ కాంప్లెక్స్, చిరంజీవి పార్క్, మున్సిపల్ ఆఫీస్, ప్రకాష్ నగర్ మీదుగా కవాతు నిర్వహించారు.
కేంద్ర సాయుధ బలగాలతో కలిసి పోలీసు అధికారులు కవాతు నిర్వహిస్తూ, పట్టణ ప్రజలలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారిలో ధైర్యాన్ని నింపే విధంగా ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారన్నారు.
ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడానికి ప్రధాన కారణం...ఎటువంటి అల్లర్లు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా, శాంతిభద్రతలను కాపాడడానికి 100 మంది కేంద్ర సాయుధ బలగాల పోలీసులతో కవాతు నిర్వహించారు.
ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా దానికి జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం ఎల్లవేళలా ఉంటుందని జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ తెలిపారు.