కానిస్టేబుల్ హత్య కేసులో రెండవ ముద్దాయి అరెస్ట్...
కానిస్టేబుల్ హత్య కేసులో రెండవ ముద్దాయి అరెస్ట్...
నంద్యాల క్రైమ్, మార్చి 02 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా పోలీస్ సూపరిటెండెంట్ ఉత్తర్వుల మేరకు నంద్యాల టౌన్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 208/2022U/S147,148,363,302,120(B)216 IPC r/w 149 IPC కేసులోని పరారీలో ఉన్న ముద్దాయి సాకే రాజ్ కుమార్ అలియాస్ (రోజా కుంట పెద్ధ) (28)సంవత్సరాలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. రోజాకుంట వీధి నంద్యాల పట్టణము నంద్యాల జిల్లా అతని స్వగ్రామం. జగరాయిపేట సనపల్లి పోస్ట్ ఉప్పలకుత్తం మండలము అమలాపురం తాలూకా తూర్పుగోదావరి జిల్లాలో అతని పైన ఉన్న నాన్ బెయిలబుల్ వారంటీ మేరకు ఈ రోజు అనగా 02.03.2024 వ తేదీన ఉదయం 9 గంటలకు నంద్యాల పరిసర ప్రాంతంలో గల రాణి మహరాణి థియేటర్ దగ్గర గల కుందూ నది బ్రిడ్జి వద్ద నంద్యాల టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకోవడమైనది... సదరు ముద్దాయి సాకే రాజ్ కుమార్ అలియాస్ రోజా కుంట పెద్ద 7.8.2022 తేదీన పోలీస్ కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసిన కేసులోని రెండవ ముద్దాయి ఇతర సుమారుగా 18 నెలలుగా పరారులో వున్నాడు.