కరెంట్ షాక్ తో యువకుడు మృతి...పరామర్శించిన ఎమ్మెల్యే
కరెంట్ షాక్ తో యువకుడు మృతి...పరామర్శించిన ఎమ్మెల్యే
--పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన
-- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, మార్చి 17 ( పీపుల్స్ మోటివేషన్ ):-
వనపర్తి పట్టణం 16 వార్డు కు చెందిన ఖలీల్ వనపర్తి పట్టణ శివారు లోని విద్యుత్ ఉపకేంద్రాల్లో ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులు చేసే విభాగంలో గత కొంతకాలంగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం సెలవు దినం కావడంతో లైన్మెన్ అనిల్ వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో ఒక రైతు ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని బాగు చేయాలని ఖలీల్ ను తీసుకువెళ్లాడు.ట్రాన్స్ఫార్మర్స్ బాగు చేయడానికి వెళ్లిన ఖలీల్ కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి మృతదేహం జిల్లా ఆస్పత్రికి చేరుకున్నదని తెలుసుకొని వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదానికి జరిగిన కారణాలు అడిగి తెలుసుకున్నారు.ఖలీల్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరపున అందజేయాల్సిన సహాయ సహకరాలు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు సూచించారు.
మృతుడి కుటుంబానికి తను ఎల్లవేళల అండగా ఉంటారని ఎమ్మెల్యే భరోసా కల్పించారు. ఈ పరామర్శలో వనపర్తి పట్టణ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.