నడిగడ్డ వాసుల రుణం తీర్చుకుంటా.... ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి
నడిగడ్డ వాసుల రుణం తీర్చుకుంటా.... ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి
-శిల్పా సేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత మినరల్ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం... ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి
నంద్యాల, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల ఎమ్మెల్యేగా తన విజయానికి కృషి చేసిన నడిగడ్డ ప్రాంతవాసుల రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తనవంతుగా శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి పేర్కొన్నారు శనివారం ఉదయం స్థానిక ఐదో వార్డులో నడిగడ్డ ప్రాంతంలో శిల్పా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్సీ ఇసాక్ భాష మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీ సా, స్థానిక వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ...నడిగడ్డ ప్రాంతంలో అత్యధికంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు జీవిస్తున్నాయని తాను ఎమ్మెల్యేగా అధికారంలోకి రావడానికి ఈ ప్రాంత వాసులు ఆ యొక్క కృషి, సహకారం, ఆశీర్వాదం ఎంతో ఉందని అన్నారు. తనవంతుగా వారి రుణం తీర్చుకునే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాంతంలో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంటే టిడిపి నాయకులు అడ్డుపడి చేపట్టకుండా చేశారన్నారు. అయితే నేడు అదే ప్రాంతంలో ఉన్న కొద్ది స్థలంలోనే నడిగడ్డ ప్రాంతవాసులందరికి సురక్షితమైన మంచినీటిని అందించేందుకు దాదాపు 3వేల లీటర్ల సామర్థ్యంతో మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం మూడు గంటల పాటుగా నీటి సరఫరా అందుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో గల్లీ దవాఖాన ఏర్పాటు చేసి ఉచిత వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి కౌన్సిలర్స్ శాదిక్ పాషా, కలాం భాష సమద్ తబ్రేజ్ మాజీ కౌన్సిలర్ చాంద్ బి కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం వార్డు వైసిపి నాయకులు పాల్గొన్నారు