ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న SR జూనియర్ కాలేజ్
ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న SR జూనియర్ కాలేజ్
విద్యార్థుల అడ్మిషన్ వేటలో SR జూనియర్ కళాశాల యాజమాన్యం
పదవ తరగతి పరీక్షలు అయిపోకముందే దాదాపుగా 200 ల అడ్మిషన్లు చేసినట్టు సమాచారం
ఒక అడ్మిషన్ కి 5 నుంచి 10 వేల కమీషన్..
ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖతారు..
చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఆర్ఐఓ
ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు
కర్నూలు, మార్చి 19 (పీపుల్స్ మోటివేషన్):-
రాష్ట్ర మొత్తం మీదుగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని జేఈఈ మెయిన్స్ నీట్ అంటూ ద్వితీయ సంవత్సరం అడ్మిషన్లు ఒకవైపు అలాగే పదవ తరగతి ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ విడుదల చేసిన రోజు నుంచి ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 30,753 మంది ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులను ఎజెండాగా పెట్టుకొని కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రమే 30 నుంచి 40 మందికి పైగా పిఆర్ఓ లతో నిరుపేద కుటుంబాల యొక్క అడ్మిషన్ల వేటలో పిఆర్ఓ లకి అడ్మిషన్ కి ఐదు నుంచి పదివేల రూపాయల కమిషన్ ఆశలు చూపిస్తూ ఎస్సార్ కళాశాల యాజమాన్యం నిమగ్నమై ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు విడుదల చేసేంతవరకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల యొక్క ఊసే వినపడకూడదని అలా అడ్మిషన్లు చేసేటువంటి జూనియర్ కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ నిరుపేద కుటుంబాల నుంచి ముందస్తు అడ్మిషన్లు అంటూ ఆశ చూయిస్తూ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు లేనిపోని ఆశలు కల్పిస్తూ విద్యార్థుల యొక్క జీవితాలలో వారి తల్లిదండ్రుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలను భయభ్రాంతులకు చేస్తున్నాయి. SRజూనియర్ కళాశాలలో ఈ అడ్మిషన్ల పేర్లతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ మనం చూస్తూనే ఉన్నా ఇకనైనా ఉన్నతాధికారులు ఇటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థుల జీవితాలను కాపాడాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇలాంటి వాటిపై దృష్టి సారించాలని ఎంతోమంది తల్లిదండ్రులు వాపోతున్నట్లు సమాచారం.