10వ తరగతి ఫలితాల విడుదల...ఏప్రిల్ 25వ తేదీ
10వ తరగతి ఫలితాల విడుదల...ఏప్రిల్ 25వ తేదీ
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
ఎట్టకేలక ఏఈ టెన్త్ ఫలితాల విడుదలకు లైన్‌క్లియర్ అయింది. ఇప్పటికే టెన్త్ జవాబుపత్రాల వేల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సారి టెన్త్ ఫలితాల విడుదలకు దాదాపు కసరత్తు పూర్తైంది. ఈ సారి పదో తరగతి పరీక్షలను 6,30,633 మంది రాశారు.
వీరికి సంబందించిన 47,88,738 జవాబుపత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించి 26 జిల్లాల్లో సెంటర్లను ఏర్పాటు చేసి.. అత్యంత త్వరగానే వేల్యూయేషన్ పూర్తి చేశారు. మరోసారి జవాబు పత్రాలు పునఃపరిశీలన చేసి మార్కులు కంప్యూటీకరణ చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ సారి ఏపీ పదో తరగతి ఫలితాలు ముందుగానే రానున్నాయి. గత ఏడాది షెడ్యూల్ చూస్తే.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమై.. 18వ తేదీ వరకు కొనసాగాయి. మే 6వ తేదీన ఫలితాలు వచ్చాయి. కానీ ఈసారి చూస్తే.. 2024 మార్చి 18వ తేదీనే ఎగ్జామ్స్ ప్రారంభమైన.. మార్చి 30వ తేదీతోనే ముగిసాయి. దీంతో ఈసారి పదో తరగతి ఫలితాలు తొందరగానే రానున్నాయి. అన్ని కుదిరితే.. ఏప్రిల్ 25వ తేదీ నుంచి 30వ తేదీ లోపు ఫలితాలలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.