-Advertisement-

అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తా.. నాది 9నెంబర్ల సెల్ కాదు

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

అర్ధరాత్రి ఫోన్ చేసినా స్పందిస్తా.. నాది 9నెంబర్ల సెల్ కాదు

పరిశ్రమలు తీసుకొచ్చి మహిళలకు, యువతకు ఉపాధి కల్పిస్తా...

నగరాన్ని అధ్వాన్న పరిస్థితిలోకి నెట్టింది వైసిపినే..‌‌.

-కోట్ల సుజాతమ్మ 

Kotla sujathamma
ప్యాపిలి, ఏప్రిల్ 21 (పీపుల్స్ మోటివేషన్):-

ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే.. తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని.. అర్ధరాత్రి వేళ అయినా... నేను స్పందిస్తానని నాది 9 నెంబర్ల సెల్ ఫోన్ కాదని సుజాతమ్మ అన్నారు. ప్యాపిలి మండలం పి ఆర్ పల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం భాష్యం రామాంజనేయులు, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు, జయరాం రెడ్డి ఆధ్వర్యంలోఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాలనీకు వచ్చిన ప్రజల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. పలుచోట్ల పూల వర్షం కురిపిస్తూ, హారతులు పట్టి ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ బాబు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు, తాము అధికారంలోకి రాగానే చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ నేడు ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఉందంటే.. దీనికి కారణం వైసిపి నాయకులేని విమర్శలు చేశారు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని దీని వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి కార్యక్రమంలోనూ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని మరిచిపోయారని విమర్శలు చేశారు. తాము అధికారంలోకిరాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోపాటు డంపింగ్ యార్డ్ ను తరలించడమే తొలి కర్తవ్యంగా తీసుకుంటామన్నారు. కొందరు మహిళలు తమకు ఉపాధి లేదని తన దృష్టికి తీసుకొచ్చారని.. నా భర్త ఎమ్మెల్యే కాగానే కచ్చితంగా నగరానికి పరిశ్రమలు తీసుకొచ్చి మహిళలకు, యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. మంత్రి ని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏదైనా సమస్య ఉంటే పారిపోయే వ్యక్తిని కాదని.. మీరు అర్ధరాత్రి వేళ ఫోన్ చేసినా నేను స్పందిస్తానన్నారు. వారిలా తొమ్మిది నెంబర్ల తరహాలో వ్యవహారం ఉండదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇతర ముఖ్య నాయకులు మాట్లాడుతూ కోట్ల ప్రకాశ్ రెడ్డి ని గెలిపించడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఒక మంచి అవినీతి మచ్చలేని నాయకుడిని చంద్రబాబు తీసుకొచ్చారని.. ఆయనకు మనము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారి అభిప్రాయపడ్డారు. నాయకులందరూ కలిసి వారి మెజార్టీ సాధించే దిశగా పని చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో చండపల్లి నాగేశ్వరరావు, లక్ష్మీనారాయణ యాదవ్, టిడిపి మండల అధ్యక్షుడు రామసుబ్బయ్య, ఎర్రగుంట్ల పల్లె బత్తుల రమేష్ రెడ్డి, జక్కాశానికుంట్ల జయరాముడు, ఆదిరెడ్డి, గుడిపాడు చిన్న వెంకటరెడ్డి, ప్యాపిలి ఖాజీ ఫీరా భారీ ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-