లిక్కర్ దోస్తీ.. నిబంధనలు నీల్.. మధ్యం అమ్మకాలు ఫుల్...మండలం లో మద్యం మాయ...
లిక్కర్ దోస్తీ..
నిబంధనలు నీల్..
మధ్యం అమ్మకాలు ఫుల్..
మండలం లో మద్యం మాయ...
మధ్యం తో మండలం ఉక్కిరి బిక్కిరి..
చెన్నారావుపేట, ఏప్రిల్ 01 (పీపుల్స్ మోటివేషన్):-చెన్నరావుపేట మండలంలో రోజు రోజుకూ పుట్ట గొడుగులు లాగా పుట్టుకొస్తున్నాయి, ఎంపీ ఎన్నికల కోడ్ అమలులో వున్న రోజు రోజు కు మద్యం అమ్మకాలు పెరిగిపోతున్నాయి.మండలంలో గల గ్రామాల్లో మధ్యం అమ్మకాలు జోరు, అధికారుల పర్యవేక్షణ ఫూర్...ఆని మండలం లో బహిరంగంగానే అరోపణలు వస్తున్నాయి.
సందు సందులో మందు...
మండలంలో గల 30 గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం ఏం సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారు ఆని అరోపణలు వస్తున్నాయి. గ్రామల్లో మధ్య రాత్రి 12 గంటల వరకు బెల్ట్ షాప్ నిర్వాహకులు అమ్మడం తో యువత, గ్రామాల్లో గిరిజనుల జీవితాలు అతల కుతలం అవుతున్న ఎక్సైజ్ శాఖ ఏ మాత్రం పట్టించుకోకపోవడం అనేది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో ఆని గ్రామాల్లో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఏరులై పారుతోంది...
గ్రామాల్లో గుడుంబా, మధ్యం ఏరులై పారుతున్న అంత ఏమరుపాటు తనం ఎందుకో ఎక్సైజ్ శాఖ కు ఆని విద్యావంతులు ఆరోపిస్తున్నారు. షాప్ షాపుకి మద్యం అమ్మకాలు జోరుగా విక్రయిస్తున్న పర్యవేక్షణ పక్కదారి పట్టింది.
మధ్యం తో మండలం ఉక్కిరి బిక్కిరి...
మండలంలో ఏ ఊరు చూసిన మధ్యం తో మునిగి తేలుతుంది. అయినా అధికారులు రారు అపరూ అంటూ గ్రామాల్లో బహిరంగంగా అరోపణలు వస్తున్నాయి.
దోస్తీ.... దోస్తీ.... దోస్తీ....
మధ్యం ప్రియులు మధ్యం తో దోస్తీ అట, మరీ అధికారులు ఎవరితో దోస్తీ, అంటూ విపరీతమైన అరోపణలు వస్తున్న అదికారులు దాడులు చేయడంలో ఎందుకు వెనుక ఆడుతున్నరో అంటూ ఆరోపణలు వెల్లువ.